Supriya : నేను హీరోయిన్ గా చేస్తా అంటే తాతయ్య వద్దన్నారు.. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా తర్వాత..

తాజాగా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బాయ్స్ హాస్టల్ అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుప్రియ మీడియా ముందుకి వచ్చారు.

Supriya : నేను హీరోయిన్ గా చేస్తా అంటే తాతయ్య వద్దన్నారు.. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా తర్వాత..

Supriya Yarlagadda comments about her acting career and Akkineni Nageswara Rao

Updated On : August 24, 2023 / 7:04 AM IST

Supriya Yarlagadda : సుప్రియ యార్లగడ్డ.. అక్కినేని ఫ్యామిలీ మెంబర్ గా అందరికి తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లో హీరోయిన్ గా నటించింది అని కూడా తెలిసిందే. అయితే ఆ ఒక్క సినిమా చేసి తర్వాత నటిగా సినిమాలకు దూరమైపోయింది. అప్పట్నుంచి అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) భాద్యతలు చూసుకుంటుంది సుప్రియ. ఇటీవల కొన్నేళ్ల క్రితం గూఢచారి(Goodachari) సినిమాతో నటిగా కంబ్యాక్ ఇచ్చినా ఆ ఒక్క సినిమా చేసి ఆపేసింది.

తాజాగా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బాయ్స్ హాస్టల్ అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుప్రియ మీడియా ముందుకి వచ్చారు. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది సుప్రియ.

మళ్ళీ తాను సినిమాల్లో నటించడం గురించి ప్రశ్నించగా సుప్రియ సమాధానమిస్తూ.. ఫస్ట్ నేనే హీరోయిన్ అవ్వాలనుకున్నాను. ఇంట్లో చెప్తే తాతయ్య వద్దు అన్నారు. నేను చేయలేను అన్నారు. దీంతో నేను ఇంకా గట్టిగా పట్టుబట్టి ఒకసారి చేస్తేనే కదా తెలిసేది చేయగలనో లేదో అనేది అని ఒప్పించి ఆ సినిమా చేశాను. కానీ ఆ సినిమా చేసేటప్పుడే నా వల్ల కాలేదు. ఇంక ఆ సినిమా తర్వాత నటిగా నా వల్ల కాదని అర్థమైపోయింది. అందుకే ఆపేసాను అని తెలిపారు.

SSMB 29 : మహేష్ రాజమౌళి సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారు.. SSMB29పై విజయేంద్రప్రసాద్ కీలకవ్యాఖ్యలు..

రీ ఎంట్రీ గూఢచారి సినిమా గురించి ప్రస్తావన రాగా.. రీ ఎంట్రీ అని కాదు, నాకు కథ నచ్చింది చేయడానికి స్కోప్ ఉంది. వాళ్ళు అడిగారు కాబట్టి చేశాను. గూఢచారి 2లో కూడా వాళ్ళు అడిగితే చేస్తాను. అలాంటి మంచి కథ, పాత్రలు వస్తే చేయడానికి ప్రాబ్లమ్ ఏం లేదు అని తెలిపారు సుప్రియ.