Tamil Bigg Boss 7 : తమిళనాట మొదలైన బిగ్‌బాస్ సందడి.. తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్..

Tamil Bigg Boss 7 : తమిళనాట మొదలైన బిగ్‌బాస్ సందడి.. తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్..

Tamil Bigg Boss Season 7 Started as Kamal Haasan Host Total 18 Contestants Full List and Details Here

Tamil Bigg Boss 7 :  పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ దూసుకుపోతుంది. ఇటీవలే తెలుగులో సీజన్ 7 మొదలవ్వగా ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయింది. ఇప్పుడు తమిళనాడులో బిగ్‌బాస్ సందడి షురూ అయింది. అక్టోబర్ 1న ఆదివారం నాడు తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా కమల్ హాసన్ తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ కనిపించబోతున్నాడు.

నిన్న ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్ మొదలైంది. నేటి నుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని,ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో విజయ్ టెలివిజన్ ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీలో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది. కమల్ హాసన్(Kamal Haasan) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పిలిచి హౌస్ లోకి పంపించాడు.

తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్..

నటుడు, కమెడియన్ ‘కూల్ సురేష్’. పలు తమిళ్ సినిమాలు, సీరియల్స్ లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ‘పూర్ణిమ రవి’. సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న పూర్ణిమ రవి ఇప్పుడిప్పుడే ఆర్టిస్ట్ గా ఛాన్సులు తెచ్చుకుంటుంది.

నటి ‘రవీనా దాహా’. పలు తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

నటుడు ‘ప్రదీప్ ఆంటోనీ’. పలు తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ ఆంటోనీ గతంలో సీజన్ 3కి కూడా వచ్చాడు. ఇప్పుడు రెండో సారి రావడం విశేషం.

సింగర్, ర్యాపర్ ‘నిక్సన్’. నిక్సన్ సింగర్ గా ర్యాప్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటలు పలు సినిమాల్లో కూడా సాంగ్స్ రాసి పాడాడు.

నటి ‘వినూష దేవి’. పలు తమిళ్ టీవీ సీరియల్స్, షోలతో గుర్తింపు తెచ్చుకుంది నటి వినుష దేవి.

డ్యాన్సర్ ‘మణిచంద్ర’. పలు డ్యాన్స్ షోలలో పాల్గొని, పలు సినిమాల్లో కూడా సైడ్ డ్యాన్సర్ గా, చిన్న సినిమాలకు కొరియోగ్రఫర్ గా పనిచేశాడు మణిచంద్ర.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, డ్యాన్సర్, నటి ‘అక్షయ ఉదయ్ కుమార్’. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. డ్యాన్సర్ గా సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించింది.

ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ కూతురు ‘జోవిక విజయ్ కుమార్’. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా, కుకింగ్ యూట్యూబర్ గా జోవిక విజయ్ కుమార్ గుర్తింపు తెచ్చుకుంది. గతంలో వనితా విజయ్ కుమార్ కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈమె కూతురు ఎంట్రీ ఇచ్చింది.

డ్యాన్సర్ ‘ఐషు’. పలు టీవీ షోలలో డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో వీళ్ళ అన్నయ్య కూడా బిగ్ బాస్ లో పాల్గొనడం విశేషం.

నటుడు ‘విష్ణు విజయ్’. పలు తమిళ్ టీవీ సీరియల్స్, షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

నటి ‘మాయా కృష్ణన్’. పలు తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న మాయ కృష్ణన్ కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో సెక్స్ వర్కర్ గా నటించి ఆ ఒక్క సినిమాతో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. యూత్ లో మయా కృష్ణకి మంచి ఫ్యాన్ ఫాలోయిగ్ ఉంది. త్వరలో విక్రమ్ ధ్రువ నక్షత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది మాయా.

నటుడు ‘శరవణన్ విక్రమ్’. పలు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్.

సింగర్, నటుడు ‘యుగేంద్రన్ వాసుదేవన్’. సింగర్ గా, సంగీత దర్శకుడిగా, నటుడిగా పలు తమిళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

నటి ‘విచిత్ర’. పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది.

నటుడు, రచయిత ‘బావ చెల్లాదురై’. అనేక సినిమాలకు రచయితగా పనిచేసిన చెల్లాదురై ఇటీవల పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.

నటి, డ్యాన్సర్ ‘అనన్య రావు’. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా, డ్యాన్సర్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది అనన్య రావు.

కొరియోగ్రాఫర్ ‘విజయ్ వర్మ’. పలు టీవీ షోలలో తన డ్యాన్స్ లతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ప్రస్తుతం తమిళ్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

ఇలా మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ ని ఈసారి బిగ్‌బాస్ తమిళ్ కి తీసుకొచ్చారు. ఇందులో మాయ కృష్ణన్, జోవిక విజయ్ కుమార్, అక్షయ.. తెలుగువారికి కూడా పరిచయమే. మరి ఈసారి వీరిలో ఎవరు తమిళ్ బిగ్‌బాస్ 7 టైటిల్ విన్ అవుతారో చూడాలి.