Ahimsa Movie Teaser: ‘అహింస’ టీజర్ టాక్.. తేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా..?

టాలీవుడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అహింస’ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Ahimsa Movie Teaser: ‘అహింస’ టీజర్ టాక్.. తేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా..?

Teja Abhiram Daggubati Ahimsa Movie Teaser Launched

Ahimsa Movie Teaser: టాలీవుడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అహింస’ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Ahimsa Teaser : అహింస టీజర్ రిలీజ్.. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి హీరో ఎంట్రీ.. తేజ మార్క్ కథేనా??

ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఓ సాదాసీదా యువకుడు, అహింసను నమ్ముతూ జీవనం కొనసాగిస్తుంటాడు. అతడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. అహింసను పాటించే అతడు హింసను ఎందుకు ఎంచుకున్నాడనేది మనకు ఈ సినిమా కథగా చూపించనున్నాడు దర్శకుడు తేజ. ఈ టీజర్ చూస్తుంటే, ఈ చిత్రాన్ని తేజ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుని, తెరకెక్కించినట్లుగా కనిపిస్తుంది. ఎక్కడా ఎలాంటి తప్పులకు తావులేకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టాలనే కసిగా తేజ ఉన్నట్లు కనిపిస్తుంది.

Ahimsa Movie: ‘కృష్ణుడు కన్నా బుద్దుడు మిన్న అంటున్న’ రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి.. “అహింస” డైలాగ్ పోస్టర్స్ రిలీజ్!

ఇక ఈ సినిమాలో అభిరామ్ దగ్గుబాటి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. హీరోయిన్‌గా నటిస్తున్న గీతిక కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్పీ పట్నాయక్ చాలా రోజుల తరువాత ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ‘అహింస’ సినిమాతో దర్శకుడు తేజ నిజంగానే సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అనేది ఈ సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.