Kantara : ఆ మ్యూజిక్ మాదే.. కాంతార సినిమా టీంకి లీగల్ నోటీసులు..

తాజాగా ఈ సినిమాలో వాడిన మ్యూజిక్ మాదే, లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కన్నడలో ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. వీరు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ ని.............

Kantara : ఆ మ్యూజిక్ మాదే.. కాంతార సినిమా టీంకి లీగల్ నోటీసులు..

Thaikkudam Bridge wants to send legal notices to Kantara movie team regarding copy music

Kantara :  రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా తెరకెక్కిన కాంతార సినిమా ఎంత పెద్ద భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మొదట కన్నడలో రిలీజయి హిట్ కొట్టక ఆ తర్వాత హిందీ, తెలుగు భాషల్లో భారీ విజయం సాధించింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమాకి ఇప్పటివరకు దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులతో పాటు స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో వాడిన మ్యూజిక్ మాదే, లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కన్నడలో ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. వీరు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ ని డిజైన్ చేశారు. గతంలో వీరు నవరసం పేరుతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఈ మ్యూజిక్ కాంతార సినిమాలోని బాగా పాపులర్ అయిన వరాహ రూపం మ్యూజిక్ ఒకేలా ఉందని తైక్కుడం బ్రిడ్జ్ టీం ఆరోపిస్తున్నారు.

Dhoni : D ఎంటర్టైన్మెంట్.. ధోని ఎంటర్టైన్మెంట్.. సినిమా మొదలుపెట్టేశాడుగా..

దీనిపై తైక్కుడం బ్రిడ్జ్ తమ సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ.. ”మా ఆడియన్స్ కి మేము ఒకటే చెప్తున్నాము. కాంతార సినిమాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా సాంగ్ నవరసం, కాంతార లోని వరాహ రూపం సాంగ్ లో ఉన్న మ్యూజిక్ చాలా వరకు ఒకటే. ఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాలని ఉల్లంఘించడమే అవుతుంది. కాపీ కొట్టడం, ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. ఆ మ్యూజిక్ పూర్తిగా మా సొంతం. అందుకే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. చిత్ర యూనిట్ కి లీగల్ నోటీసులు పంపిస్తున్నాం” అని తెలిపారు. అలాగే చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా ఈ పోస్ట్ ని ట్యాగ్ చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ స్పందించలేదు.