Bheemla Nayak: చేతులెత్తేసిన యాజమాన్యాలు.. కృష్ణాజిల్లాలో థియేటర్లు బంద్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మూడు వేల థియేటర్లో ప్రదర్శన మొదలైన ఈ సినిమాకి తెలుగు..

Bheemla Nayak: చేతులెత్తేసిన యాజమాన్యాలు.. కృష్ణాజిల్లాలో థియేటర్లు బంద్!

Bheemla Nayak

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మూడు వేల థియేటర్లో ప్రదర్శన మొదలైన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రమైన ఏపీలో పలు ఇబ్బందులు తలెత్తాయి. అభిమానుల కోసం నిర్వహించే బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు టికెట్ల తగ్గింపు ధరలకే అమ్మకాలతో పలు చోట్ల థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నాయి.

Bheemla Nayak : పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ అభిమానుల సెగ

సినిమా విడుదలకి ముందే గురువారమే రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లకు ప్రభుత్వం ముందే హెచ్చరికలు జారీ చేసింది. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోలు వేసినా, ఎక్స్ట్రా షోలు వేసినా, ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు అంటూ థియేటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై పవన్ అభిమానులు ఏపీలో పలుచోట్ల నిరసనలు తెలపడంతో పలు థియేటర్లలో షోలు నిలిచిపోవడం.. అభిమానులు థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తూ కూర్చున్నారు.

Bheemla Nayak : ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాల కోసం పవన్ ఫ్యాన్స్ విరాళాల సేకరణ

మరికొన్ని చోట్ల అసలు ముందుగానే యాజమాన్యాలు ప్రదర్శన లేనట్లుగా థియేటర్ల వద్ద బోర్డులు పెట్టేశారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సొంత జిల్లా కృష్ణాజిల్లాలోనే పలు థియేటర్లలో ప్రదర్శన ఆగిపోయింది. విస్సన్నపేటలో టికెట్ ధర ప్రభుత్వ లెక్క ప్రకారం రూ.35 అమ్మాలి. దీంతో ఈ రేటుకి ప్రదర్శన గిట్టుబాటు కాదని యాజమాన్యాలు బోర్డు పెట్టేశాయి. మైలవరంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అభిమానులు థియేటర్ల ముందు రాస్తారోకు దిగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.