Tollywood : రాజమౌళి ట్వీట్‌‌.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు

ఎవరినీ అడగకుండానే.. సాయం చేసే పరిస్థితి మీకు ఉందని, ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ డైరెక్టర్ గా ఉండి..ఇలా చేయడం ఏంటీ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు...

Tollywood : రాజమౌళి ట్వీట్‌‌.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు

Rajamouli

Tollywood Director SS Rajamouli : ప్రముఖ దర్శకులు రాజమౌళి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఓ నటిని ఆదుకోవాలనే విషయంలో ఆయన చేసి ట్వీట్ వైరల్ గా మారింది. తీవ్రస్థాయిలో నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సాయం చేయాలని ట్వీట్ చేయడం ఏంటీ ? మీరు ఆ మాత్రం సాయం చేయలేరా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరినీ అడగకుండానే.. సాయం చేసే పరిస్థితి మీకు ఉందని, ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ డైరెక్టర్ గా ఉండి..ఇలా చేయడం ఏంటీ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. 2022, జనవరి 29వ తేదీ ఉదయం చేసిన ట్వీట్ కు సాయంత్రం 8 గంటల వరకు 2 వేల 918 మంది రీ ట్వీట్ చేయగా…ఎంతో మంది రియాక్ట్ అవుతున్నారు.

Read More : F3 Movie: షూటింగ్ జర్నీ కంప్లీట్.. ఇక నవ్వుల జర్నీ స్టార్ట్!

అసలేం జరిగింది ?

బాహుబలి సినిమా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ సత్తా ఏంటో చూపెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కోసం పనిచేసిన దేవిక ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్నారని అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. దేవికతో కలిసి పని చేయడం జరిగిందని, పనిపట్ల అంకిత భావం చూపెడుతుందని..ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆమెకు సాయం చేయడానికి ముందుకు రావాలని ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. ఈ ట్వీట్ కు ఫుల్ రెస్పాండ్ రావడం అటుంచి.. నెటిజన్లు రాజమౌళిపై విమర్శలకు దిగుతున్నారు. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకొని..ఇతరులను సాయం కోరుతారా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీరు చేస్తున్న ట్వీట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయని చెప్పవచ్చు.

Read More : Punjab Polls : పంజాబ్ లోక్ కాంగ్రెస్.. ఏడుగురు అభ్య‌ర్థుల తొలి జాబితా..

ఇక రాజమౌళి విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ లు నటించిన RRR సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28వ తేదీల్లో ఏదో ఒక తేదీల్లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.