Adipurush : బొమ్మల సినిమా చూపిస్తావా అంటూ.. ఆదిపురుష్ డైరెక్టర్ పై దారుణంగా ట్రోల్స్..

టీజర్ చూడటానికి చాలా బాగుంది. రామాయణాన్ని కొత్తగా చూపించడానికి ఓం రౌత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే టీజర్ మొత్తం VFX లతోనే ఉండటంతో ఇది కార్టూన్ సినిమాలాగా..........

Adipurush : బొమ్మల సినిమా చూపిస్తావా అంటూ.. ఆదిపురుష్ డైరెక్టర్ పై దారుణంగా ట్రోల్స్..

Trolls on Adipurush Director Omraut after releasing Teaser

Adipurush :  ప్రభాస్ ఫ్యాన్స్‌ రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ అప్డేట్ ఆదివారం(అక్టోబర్‌ 2న) సాయంత్రం ఇచ్చేశారు. అయోధ్యలో గ్రాండ్‌గా జరిగిన ఆదిపురుష్ ఈవెంట్‌లో టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇక టీజర్ చూడటానికి చాలా బాగుంది. రామాయణాన్ని కొత్తగా చూపించడానికి ఓం రౌత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే టీజర్ మొత్తం VFX లతోనే ఉండటంతో ఇది కార్టూన్ సినిమాలాగా అనిపిస్తుంది. దీంతో టీజర్ బాగున్నా విమర్శలు వస్తున్నాయి.

ఇటీవలే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో అభిమానులు ఆదిపురుష్ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. రామాయణాన్ని కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కిస్తారని అనుకున్నారు అంతా. పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, షూటింగ్ త్వరగా పూర్తయినప్పుడే కొంతమంది ఇది గ్రాఫిక్స్ సినిమా కాదు కదా అని అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ తో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

BiggBoss 6 Day 28 : ఆరోహిని పంపించేశారుగా.. ఏడ్చేసిన శ్రీహాన్.. సూర్యతో కేరళకి స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేసిన ఆరోహి..

టీజర్ చూసిన తర్వాత కంటెంట్ బాగానే ఉన్నా, ఇది ఒక యానిమి సినిమాలాగా ఉందని, బొమ్మల సినిమా, కార్టూన్స్ లా ఉందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ ని తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. రామాయణం కథ అని చెప్పి షూటింగ్ త్వరగా పూర్తి చేసినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కనుక నిజంగానే మొత్తం గ్రాఫిక్స్ సినిమా అయితే డైరెక్టర్ ని మాత్రం వదలం అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ టీజర్ చూస్తుంటే రజినీకాంత్ కొచ్చాడియన్ సినిమా గుర్తొస్తుందంటూ, కొన్ని సీన్స్ అయితే కింగ్ కాంగ్ లాంటి సినిమాలు గుర్తొచ్చేలా చేస్తున్నాయంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజంగానే గ్రాఫిక్స్ సినిమా అయితే కంటెంట్ ఎంత బాగున్నా ప్రేక్షకులు, జనాలు ప్రభాస్ ని అలా చూడటానికి ఇష్టపడరు. ఇది పిల్లల సినిమా అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ పై డైరెక్టర్ ఓం రౌత్ మాత్రం స్పందించలేదు. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. అసలు ఈ సినిమా ఏంటో తెలియాలంటే అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందేనేమో.