Varun Tej : మా ఫ్యామిలీనే ఒక క్రికెట్ టీం.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ మ్యాచ్ లో వరుణ్ తేజ్ కామెంటరీ చేస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varun Tej : మా ఫ్యామిలీనే ఒక క్రికెట్ టీం.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్..

Varun Tej comments about mega family at one day world cup

Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కి కామెంటరీ చేస్తూ కొత్త అవతారం ఎత్తాడు. నేడు అక్టోబర్ 22న ధ‌ర్మ‌శాల వేదిక‌గా న్యూజిలాండ్ జ‌ట్టుతో భార‌త్ త‌ల‌ప‌డుతోంది. ఇక ఈ మ్యాచ్ తెలుగు కామెంట్రీలో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. అక్కడ ఇతర కామెంటేటర్స్ తో కలిసి క్రికెట్ అభిమానులను వరుణ్ తేజ్ అలరించాడు. ఈక్రమంలోనే వరుణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “అందరు మమల్ని (మెగా హీరోలు) క్రికెట్ టీం అని అంటుంటారు. ఒక మ్యాచ్ ఏమైనా ప్లాన్ చేయండి. నేను బన్నీ అన్న, చరణ్ అన్న, తేజ్, శిరీష్ అందరం కలిసి వచ్చి ఆడతాం” అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిపై ఆడియన్స్ సరదా కామెంట్స్ తో రియాక్ట్ అవుతూ వస్తున్నారు. కాగా వరుణ్ తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

Also read : Uday Kiran : నా కడుపున పుట్టుంటే.. ఉదయ్ కిరణ్ బ్రతికి ఉండేవాడేమో.. ఎమోషనలైన నటి..

వరుణ్ 13వ సినిమాగా వస్తున్న ఈ మూవీని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణకు గుమ్మడికాయ కొట్టేశాడు వరుణ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 8న తెలుగు, హిందీ లాంగ్వేజ్స్ లో రిలీజ్ కానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ నటిస్తుంది.

కాగా వరుణ్ తేజ్ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ పెళ్లి ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనుందని సమాచారం. ఇటీవల రామ్ చరణ్ జంట ఇటలీ ఈ పెళ్లి పనులు చూసుకోవడానికి ముందుగానే ఇటలీ వెళ్లారు. నవంబర్ మొదటి వారంలో ఈ వివాహం జరగబోతుందని టాక్ వినిపిస్తుంది.