Varun Tej: ‘ది ఘోస్ట్’ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ మొదలెట్టాడుగా!

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా అనౌన్స్ చేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ కెరీర్‌లో 12వ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా, ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా లాంఛ్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది.

Varun Tej: ‘ది ఘోస్ట్’ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ మొదలెట్టాడుగా!

Varun Tej New Movie With Praveen Sattaru Shooting Begins

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా అనౌన్స్ చేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ కెరీర్‌లో 12వ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా, ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా లాంఛ్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది.

Varun Tej: మరో ఇంట్రెస్టింగ్ రోల్‌కు వరుణ్ సై..?

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను తాజాగా ప్రారంభించింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తి యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, గన్ పట్టుకుని వరుణ్ తేజ్ కనిపించడంతో ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు మరోసారి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

Varun Tej: మరో యంగ్ డైరెక్టర్‌కు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్..?

ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, మిగతా నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.