Vijay Devarakonda : అర్ధరాత్రి సమంతకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. మిస్ యూ అంటూ పాట పాడి..

తాజాగా విజయ్ దేవరకొండ ఓ వీడియోని షేర్ చేశాడు. విజయ్ అర్ధరాత్రి సమంతకి వీడియో కాల్ చేశాడు.

Vijay Devarakonda : అర్ధరాత్రి సమంతకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. మిస్ యూ అంటూ పాట పాడి..

Vijay Devarakonda Call to Samantha at Midnight and says Miss you video goes viral

Updated On : August 28, 2023 / 7:07 AM IST

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఖుషి(Kushi). ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో ఉన్నారు. అయితే సమంత ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ ఒక్కడే ఇక్కడ ప్రమోషన్స్ చేస్తున్నాడు. సమంత తన సోషల్ మీడియాతో పాటు అక్కడ అమెరికాలో కూడా ప్రమోషన్స్ చేస్తుంది.

తాజాగా విజయ్ దేవరకొండ ఓ వీడియోని షేర్ చేశాడు. విజయ్ అర్ధరాత్రి సమంతకి వీడియో కాల్ చేశాడు. సమంత అమెరికాలో ఉంది కాబట్టి తనకి అక్కడ ఉదయం. విజయ్ వీడియో కాల్ చేయగా సమంత లిఫ్ట్ చేసి మాట్లాడింది. విజయ్.. మిస్ అవుతున్నాను నిన్ను. నీకు ఒక జోక్ చెప్పాలి. అంటూ ఖుషి సినిమాలోని ఓ పాట పాడాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Samantha – Vennela Kishore : సమంత నిర్మాణంలో వెన్నల కిశోర్ మెయిన్ లీడ్‌తో మూవీ..!

అయితే ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇది ప్రమోషన్స్ కోసం రికార్డ్ చేసిన వీడియో అని, విజయ్ కాల్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. హీరో హీరోయిన్స్ వేర్వేరు దేశాల్లో ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ఇలా కొత్తగా చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఖుషి సినిమా రిలిజ్ ఉండటంతో విజయ్, సమంత అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)