Yashoda: “యశోద” అంటే ఎవరో తెలుసుగా.. కృష్ణ పరమాత్ముడు తల్లి.. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ అదరగొట్టిన సమంత..

సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ “యశోద”. ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తుంది. ఇటీవలే టీజర్ ని కూడా విడుదల చేసింది మూవీ టీం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నేడు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు.

Yashoda: “యశోద” అంటే ఎవరో తెలుసుగా.. కృష్ణ పరమాత్ముడు తల్లి.. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ అదరగొట్టిన సమంత..

Yashoda Movie Trailer Released

Yashoda: సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ “యశోద”. ఈ సినిమాలో సమంత ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తుంది. ఇటీవలే టీజర్ ని కూడా విడుదల చేసింది మూవీ టీం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నేడు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు.

Samantha: సమంత ఏంటి ఇలా అయ్యిపోయింది.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ట్రైలర్ చూసిన దాన్ని బట్టి ఈ సినిమా సరోగసి కథాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. పిల్లలు కనలేని మరియు అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనుకునే కొందరు సెలెబ్రెటీస్ కోసం ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే సమంత కూడా ఒక ప్రముఖ వ్యక్తి కోసం అద్దె గర్భం దాల్చుతుంది. అయితే ఆ సమయంలో అక్కడ జరిగే కొన్ని చట్ట విరుద్ధమైన పనులు సమంత కంట పడతాయి.

వాటిని బయటపెట్టే క్రమంలో సమంత ఎదురుకున్న సన్నివేశాలని.. యాక్షన్ అండ్ త్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ట్రైలర్ చివరిలో.. యశోద అంటే ఎవరో తెలుసుగా, కృష్ణ పరమాత్ముడు తల్లి అంటూ సామ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెచ్చాయి. ఇక సమంత చేసిన ఫైట్స్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. నవంబర్ 11న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్స్ హరి-హరన్ లు దర్శకత్వం వహిస్తున్నారు.