Richest Youtubers : డబ్బే డబ్బు.. యూట్యూబ్ ద్వారా కోట్ల సంపాదన.. ఇండియా రిచెస్ట్ యూట్యూబర్స్..

డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త టాలెంట్, కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు.. డబ్బు దానంతట అదే వస్తుంది. అవును.. యూట్యూబ్ పుణ్యమా అని..

Richest Youtubers : డబ్బే డబ్బు.. యూట్యూబ్ ద్వారా కోట్ల సంపాదన.. ఇండియా రిచెస్ట్ యూట్యూబర్స్..

Richest Youtubers

Richest Youtubers : డబ్బు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. అందుకు చాలా కష్టపడాలి. ఎంతో శ్రమించాలి. బాగా చదువుకుని ఉండాలి. తెలివితేటలు ఉండాలి. పెద్ద ఉద్యోగాలు చేయాలి. విదేశాలకు వెళ్లాలి. అప్పుడే డబ్బు సంపాదించగలం. ఇదీ చాలామందిలో ఉన్న అభిప్రాయం. అయితే ఇది నిన్నటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త టాలెంట్, కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు.. డబ్బు దానంతట అదే వస్తుంది. అవును.. యూట్యూబ్ పుణ్యమా అని కొందరు తమ టాలెంట్, క్రియేటివిటీతో రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో యూట్యూబ్ యాప్ ఉంటుంది. యూట్యూబ్ ఇప్పుడు కేవలం ఎంటర్ టైన్ మెంట్ ని మాత్రమే కాదు.. ఆదాయాన్ని అందించే బంగారు గనిగా మారింది.

అందరికంటే కొంచెం భిన్నంగా ఆలోచించే క్రియేటివిటీ ఉండి, అందరినీ ఆకట్టుకునే నైపుణ్యం ఉండేలే గాని ఇందులో ఊహించని డబ్బు సంపాదించవచ్చు. కొంతమంది వీటిని నిజం చేసి చూపిస్తున్నారు కూడా. ప్రస్తుతం యూట్యూబ్‌లో సొంతంగా చానెల్‌ కలిగి ఉండి.. దాని ద్వారా ఇంట్లో కూర్చునే చాలా మంది కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో దేశంలోని టాప్-10 యూట్యూబర్స్ గురించి తెలుసుకుందాం..

Bike Start Problem : హలో భయ్యా.. మీ బైక్ స్టార్ట్ కావడం లేదా? ఈ ట్రిక్ ట్రై చేయండి!

1. గౌరవ్ చౌదరి
1991 మే 7న రాజస్తాన్ లోని అజ్మీర్ లో జన్మించిన గౌరవ్.. అక్టోబర్ 18, 2015న తన యూట్యూబ్ ఛానెల్ ‘టెక్నికల్ గురూజీ’ని ప్రారంభించాడు. ఈ టెక్నికల్ గురూజీ నికర విలువ 2021 నాటికి 45 మిలియన్ డాలర్లు (సుమారు రూ.334 కోట్లు). ఈ యూట్యూబర్ తన చానెల్ ని యూఏఈ కేంద్రంగా నడిపిస్తున్నాడు. గౌరవ్ కి రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. టెక్నికల్ గురూజీ చానల్ కు 21.6 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. మరో చానల్ పేరు గౌరవ్ చౌదరి. దీనికి 4.99 మిలియన్ సబ్ స్ర్కైబర్స్ ఉన్నారు.

2. అమిత్ భదానా
అమిత్ భదానా ప్రముఖ యూట్యూబర్. 2021లో ఇతడి యూట్యూబ్ చానెల్ నికర విలువ 6.3 మిలియన్ డాలర్లు (సుమారు. రూ.46 కోట్లు). ఢిల్లీకి చెందిన భదానాకు యూట్యూబ్ లో 22 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లున్నారు.

3. నిషా మధులిక
నిషా మధులిక 1959లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. ఈమె యూట్యూబ్ చానెల్ నికర విలువ 4.47 మిలియన్ డాలర్లు (సుమారు రూ.33 కోట్లు). ఈమె యూట్యూబ్ చానెల్‌కి 12.1 మిలియన్ల సబ్ స్క్రైబర్లున్నారు. తన ‘నిషామధులిక’ యూట్యూబ్ చానెల్‌ని 2009లో ప్రారంభించారు.

4. క్యారీ మినాటీ
క్యారీ మినాటీ 1999లో హర్యానా రాష్ట్రంలో జన్మించాడు. తన యూట్యూబ్ చానెల్ నికర విలువ 4 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.29 కోట్లు). క్యారీ మినాటీ యూట్యూబ్ చానెల్‌కి 33 మిలియన్ల సబ్ స్క్రైబర్లున్నారు. తన ‘క్యారీ మినాటీ’ యూట్యూబ్ చానెల్‌ని 2014లో ప్రారంభించాడు. ఏప్రిల్ 2020లో ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

5. ఆశిష్ చంచ్లానీ
ఆశిష్ చంచ్లానీ వైన్స్ యూట్యూబ్ చానెల్‌కి 26.9 మిలియన్ల సబ్ స్క్రైబర్లున్నారు. తన ‘ఆశిష్ చంచ్లానీ వైన్స్’ యూట్యూబ్ చానెల్‌ని 2009లో ప్రారంభించాడు.

6. భువన్ బామ్
భువన్ బామ్ యూట్యూబ్ చానెల్ ‘బిబి కి వైన్స్’ నికర విలువ 3 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.22 కోట్లు). ‘బిబి కి వైన్స్’ యూట్యూబ్ చానెల్‌కి 23.6 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన ‘బిబి కి వైన్స్’ యూట్యూబ్ చానెల్‌ని 2015లో ప్రారంభించాడు.

7. సందీప్ మహేశ్వరి
సందీప్ మహేశ్వరి ప్రజాదరణ పొందిన మోటివేషనల్ స్పీకర్. 1980 సెప్టెంబర్ 28న ఢిల్లీలో జన్మించాడు. తన యూట్యూబ్ చానెల్ ‘సందీప్ మహేశ్వరి’ నికర విలువ 3 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.22 కోట్లు). ‘సందీప్ మహేశ్వరి’ యూట్యూబ్ చానెల్‌కి 21.4 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన ‘సందీప్ మహేశ్వరి’ యూట్యూబ్ చానెల్‌ని 2012లో ప్రారంభించాడు.

Airtel Prepaid Price Hike : ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. ప్రీ‌పెయిడ్ ఛార్జీల పెంపు..!

8. ఎమివే బంటాయ్
ఎమివే బంటాయ్ అసలు పేరు బిలాల్ షేక్. బిలాల్ షేక్ 1995 నవంబర్ 13న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించాడు. తన యూట్యూబ్ చానెల్ ‘ఎమివే బంటాయ్’ నికర విలువ 2.5 మిలియన్ డాలర్లు(సుమారు. రూ.18 కోట్లు). ‘ఎమివే బంటాయ్’ యూట్యూబ్ చానెల్‌కి 16.7 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన ‘ఎమివే బంటాయ్’ యూట్యూబ్ చానెల్‌ని 2013లో ప్రారంభించాడు.

9. హర్ష్ బెనివాల్
1996లో ఢిల్లీలో జన్మించిన హర్ష్ యూట్యూబ్ చానెల్ ‘హర్ష్ బెనివాల్’ నికర విలువ 2.2 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు. రూ.16 కోట్లు). ‘హర్ష్ బెనివాల్’ యూట్యూబ్ చానెల్‌కి 13.7 మిలియన్ల చందాదారులు ఉన్నారు. 2015లో యూట్యూబ్ చానెల్ ని ప్రారంభించాడు.

10. విద్యా అయ్యర్
1990లో తమిళనాడులో జన్మించిన అయ్యర్.. యూట్యూబ్ చానెల్ ‘విద్యా వోక్స్’ నికర విలువ 1.13 మిలియన్ డాలర్లు (సుమారు రూ.9 కోట్లు). ఈమె యూట్యూబ్ చానెల్‌కి 7.46 మిలియన్ల చందాదారులు ఉన్నారు. తన యూట్యూబ్ చానెల్‌ని 2014లో ప్రారంభించింది.

వీళ్లంతా తమ టాలెంట్ తో, క్రియేటివిటీతో యూట్యూబ్ ద్వారా రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నారు. పెద్దగా కష్టపడకుండానే, శ్రమించకుండానే కోట్లు ఆర్జిస్తున్నారు. మీలోనూ ఇలాంటి టాలెంట్, క్రియేటివిటీ ఉన్నాయా? ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించండి, మీలోని ప్రతిభను ప్రపంచానికి చూపండి, డబ్బు సంపాదించండి.