Two Girls Love: యువతుల మధ్య ప్రేమ.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన జంట! 2 young girl fall in love in Patna Bihar, seek protection from police

Two Girls Love: యువతుల మధ్య ప్రేమ.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన జంట!

ఇండియాలో కూడా స్వలింగ సంపర్కుల వివాహాల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి జంటల ప్రేమ, పెళ్లిళ్లపై సమాజంలో ఏమంత సదాభిప్రాయం లేనప్పటికీ కల్చర్ మాత్రం పెరుగుతూ వస్తుంది.

Two Girls Love: యువతుల మధ్య ప్రేమ.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన జంట!

Two Girls Love: ఇండియాలో కూడా స్వలింగ సంపర్కుల వివాహాల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి జంటల ప్రేమ, పెళ్లిళ్లపై సమాజంలో ఏమంత సదాభిప్రాయం లేనప్పటికీ కల్చర్ మాత్రం పెరుగుతూ వస్తుంది. 2018లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించే సెక్షన్‌ 377 రద్దు అనంతరం ఈ తరహా వివాహాలు, బంధాల కోసం సదరు వ్యక్తులు సమాజంలో న్యాయం కోసం పోరాటాల సంఖ్య పెరిగింది.

Bhopal Lovers : ప్రియుడితో బైకుపై చెల్లి చెట్టాపట్టాల్.. సినీ ఫక్కీలో అన్న చేజింగ్.. వీడియో వైరల్!

తాజాగా అలాంటి ఓ ఘటనే బిహార్​లోని పట్నాలో జరిగింది. అనే యువతిది ఇంద్రపురికు చెందిన తనిష్క్​ శ్రీ అనే యువతి.. సహస్ర ప్రాంతానికి శ్రేయా ఘోష్ కి చెందిన మరో యువతి ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరికి గత ఐదేళ్లుగా పరిచయం ఉండగా.. ఈ మధ్యే అది ప్రేమగా మారి.. కలిసి జీవించాలనుకున్నారు. ఈ విషయం వారి కుటుంబ సభ్యులు తెలియడంతో తనిష్క్​ను ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో నిర్భందించి, శ్రేయా ఘోష్​పై నకిలీ కిడ్నాప్ కేసును కూడా పెట్టారు.

Love Story: 67ఏళ్ల మహిళతో 28ఏళ్ల యువకుడు.. సహజీవనం కోసం పోరాటం

ఎలాగోలా ఇంట్లో నుండి తప్పించుకున్న తనిష్క్ శ్రేయా ఘోష్ తో కలిసి పట్నాలోని మహిళా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారట. దీంతో ఈ మహిళా జంట పట్నా ఎస్​ఎస్​పీని కలిసి ఫిర్యాదు చేసి.. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్వలింగ సంపర్కుల లైంగిక చట్టం ప్రకారం తమకు కలిసి ఉండే హక్కు ఉందని.. కుటుంబ సభ్యులతో సహా ఎవరికి తమను విడదీసే హక్కు లేదని వీరు పోరాడుతున్నారు.

×