Earthquake-Lunar Eclipse : పౌర్ణమికి, భూకంపాలకు.. చంద్ర గ్రహాణానికి.. భూప్రకంపనలకు సంబంధముందా?

భూకంపాలు రావడం సాధారణ విషయమే. కానీ.. అవి ఎలాంటి సమయం? ఎటువంటి సందర్భంలో సంభవిస్తున్నాయనేదే చర్చనీయాంశంగా మారింది. పౌర్ణమి రోజుల్లో.. గ్రహణ సమయాల్లో.. భూప్రకంపనలు, భూకంపాలు రావడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి?

Earthquake-Lunar  Eclipse : పౌర్ణమికి, భూకంపాలకు.. చంద్ర గ్రహాణానికి.. భూప్రకంపనలకు సంబంధముందా?

Earthquake-Lunar Eclipse a connection for these two_

Earthquake-Lunar Eclipse a connection for these two? : భూకంపాలు రావడం సాధారణ విషయమే. కానీ.. అవి ఎలాంటి సమయం? ఎటువంటి సందర్భంలో సంభవిస్తున్నాయనేదే చర్చనీయాంశంగా మారింది. పౌర్ణమి రోజుల్లో.. గ్రహణ సమయాల్లో.. భూప్రకంపనలు, భూకంపాలు రావడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? గ్రహస్థితిలు బాగా లేకపోతే.. అమావాస్య, పౌర్ణమి పరిధిలో భయంకరమైన ప్రమాదాలు, ఊహించని విపత్తులు తలెత్తుతాయా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?

నమ్మశక్యంగా లేకపోయినా.. జరుగుతున్న పరిణామాలు, సంభవిస్తున్న భూకంపాలు చూస్తుంటే.. దీని వెనుక కూడా ఏదో మిస్టరీ దాగుందన్న విషయం మాత్రం అర్థమవుతోంది. పౌర్ణమి సమయాల్లో.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.. అలలు పోటెత్తుతాయని  చెబుతుంటారు. మిగతా రోజుల్లో.. సముద్రంలో అలలు అంతగా పోటెత్తవని అంటారు. మరి.. పౌర్ణమి రోజే ఎందుకలా జరుగుతుంది? మిగతా రోజుల్లో సముద్రం ప్రశాంతంగా ఎందుకు కనిపిస్తుందనే ప్రశ్నలున్నాయి.? అంటే.. భూమిపై ఆవరించి ఉన్న వాతావరణానికి, ఇక్కడ తలెత్తే ప్రకృతి విపత్తులతో.. చంద్రునికి కూడా సంబంధం ఉందా? అసలేం జరుగుతోందనే సందేహాలు.. అందరినీ వెంటాడుతున్నాయ్.

ఇప్పుడు కూడా.. చంద్రగ్రహణం పూర్తయిన కొన్ని గంటల్లోనే.. హిమాలయాల్లో భూకంపం సంభవించింది. దాని ప్రభావం.. ఢిల్లీ దాకా కనిపించింది. ప్రతి ఏటా 20 వేలకు పైగా భూకంప ప్రకంపనలు నమోదవుతుంటాయని.. నివేదికలు చెబుతున్నాయ్. ఇవన్నీ.. చాలా వరకు బయటకు రావు. ఎందుకంటే.. అవి చాలా తేలికపాటివి. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్ పైన కూడా నమోదు కాదు. కానీ.. పౌర్ణమి సమయంలో సంభవించే భూకంపాలు మాత్రం.. కాస్త తీవ్రంగానే కనిపిస్తున్నాయ్. రిక్టర్ స్కేల్‌పై వాటి తీవ్రత కూడా నమోదవుతోంది. దీనిని బట్టి.. సైన్స్‌కి అందని రహస్యమేదో దాగుందనే విషయం అర్థమవుతోంది. గ్రహస్థితులు బాగా లేనప్పుడు అమావాస్య, పౌర్ణమి పరిధిలో.. భయంకరమైన ప్రమాదాలు, ఊహించని విపత్తులు తలెత్తుతాయని చాలా మంది నమ్ముతుంటారు. దీనికి సంబంధించి.. ఇప్పటికే అనేక ఉదాహరణలు చూపారు. పైగా.. పౌర్ణమి రోజుల్లోనే భూకంపాలు సంభవిస్తాయని కూడా నమ్ముతున్నారు. 2004లో భారత్‌ను ముంచెత్తిన సునామీ కూడా పౌర్ణమి రోజే చోటు చేసుకుంది.. ఈ మధ్యకాలంలో భూప్రకంపనలు సంభవించిన ఘటనలను పరిశీలిస్తే.. అవి కూడా పౌర్ణమి పరిధిలోనే జరిగాయని చెబుతున్నారు.

Earthquakes in Himalayas : హిమాలయాల్లో గ్రహణం రోజు ప్రకంపనలు .. ఢిల్లీకి ముప్పు తప్పదంటున్న నిపుణులు..?!

ఒక్క పౌర్ణమి రోజుల్లోనే కాదు.. అమావాస్య పరిధిలోనూ అనేక ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయ్. చంద్రుడు పూర్తిగా కనిపించే రోజుల్లోనైనా.. అసలే కనిపించకుండా ఉన్న రోజుల్లోనైనా.. భూకంపాలు సంభవించడం లాంటివి జరుగుతున్నాయ్. ఇది.. కేవలం భారత్‌లోనూ.. హిమాలయాల్లోనూ మాత్రమే జరగాలనేమీ లేదు. సమస్త.. భూ ప్రపంచంలో ఎక్కడైనా సంభవించొచ్చు. మరేదైనా విపత్తు రావొచ్చు. కానీ.. ఎక్కడో ఓ చోట మాత్రం ప్రభావం కచ్చితంగా ఉందని నమ్ముతున్నారు. పౌర్ణమి, అమావాస్యలు మాత్రమే కాదు.. గ్రహణాల ప్రభావం కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది. సూర్య, చంద్రగ్రహాణాలు కూడా భూమండలంలో ఎక్కడో ఓ చోట.. ఏదో ఒక ప్రకృతి విపత్తుకు కారణమవుతాయని విశ్వసిస్తారు. ఇందుకు.. జ్యోతిష్య శాస్త్రాన్ని, పురాణాలను బలంగా నమ్మేవాళ్లు.. ఎన్నో ఉదారహణలను కూడా చూపుతుంటారు. పౌర్ణమి, అమావాస్య పరిధి రోజులతో పాటు సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించిన రోజుల్లో.. ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని, ఏదో ఒక కీలక మార్పు సంభవిస్తుందని.. చెబుతుంటారు. అంతేకాదు.. ఈ రోజులు దగ్గరికొస్తున్నాయంటే.. ఏదో రకంగా.. ఎక్కడో ఓ చోట ముప్పు పొంచి ఉందని నమ్ముతారు.

Lunar Eclipse 2022 : భారత్‌లో ముగిసిన చంద్రగ్రహణం.. కనువిందు చేసిన బ్లడ్ మూన్, మళ్లీ 2025లోనే

కాసేపు.. ఈ థియరీ అంతా పక్కనబెడదాం. సైన్స్ ప్రకారం భూకంపాలు ఎలా సంభవిస్తాయో పరిశీలిస్తే.. భూమి మొత్తం నాలుగు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఇందులో.. ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్‌గా ఉంటాయి. క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్‌ని కలిపి లిథోస్పియర్ అంటారు. ఈ 50 కిలోమీటర్ల మందపాటి పొర అనేక భాగాలు విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. ఇవి.. భూమి లోపల ఏడు ఉంటాయి. ఈ ప్లేట్లు.. భూగర్భంలో బలంగా కదిలినప్పుడు.. భూప్రకంపనలు వస్తాయి. ఇది.. సైన్స్ చెబుతోంది. భూకంప తీవ్రతను.. రిక్టర్ స్కేల్‌పై కొలుస్తారు. భూకంపం సంభవించినప్పుడు.. ఆ సమయంలో భూమి లోపలి నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను లెక్కించి.. భూకంపాన్ని కొలుస్తారు. ప్లేట్ల కదలిక కారణంగా భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి.. కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది.

Lunar Eclipse 2022 : ఎరుపెక్కిన చంద్రుడు.. కనువిందు చేస్తున్న బ్లడ్‌మూన్

భూప్రకంపనలు ఎక్కువగా ఉండే ప్రదేశం ఇదే. ఈ కంపనం ఫ్రీక్వెన్సీ ఎంత దూరం ఉంటే.. దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. రిక్టర్ స్కేల్‌పై 7 కంటే ఎక్కువ తీవ్రత నమోదైతే.. భూకంపం సంభవించిన 40 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు సంభవిస్తాయి. ఇదంతా.. మనం చదువుకున్న, నమ్ముతున్న సైన్స్. అయినప్పటికీ.. పౌర్ణమి, అమావాస్య రోజుల్లోనే సముద్రం అల్లకల్లోలంగా మారడానికి.. భూమి లోపల టెక్టోనిక్‌ ప్లేట్లు విపరీతంగా కదలడానికి లింక్‌ నిజంగానే ఉంటుందా..? అన్నదే ఇప్పుడు తేల్చాల్సి ఉంది.