Nitish-Tejashwi cabinet: బిహార్ మంత్రుల్లో 72% మందిపై క్రిమినల్ కేసులు: రిపోర్ట్

ఆర్జేడీకి చెందిన 15 మంది మంత్రులు (88 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇందులో 11 మంది (65) అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారట. ఆర్జేడీతో పోల్చుకుంటే జేడీయూకి చెందిన మంత్రులు కాస్త మెరుగ్గా ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. జేడీయూ నుంచి మొత్తం 11 మంది మంత్రులు ఉండగా.. ఇందులో నలుగురు మాత్రమే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారట. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు మంత్రులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారట.

Nitish-Tejashwi cabinet: బిహార్ మంత్రుల్లో 72% మందిపై క్రిమినల్ కేసులు: రిపోర్ట్

72% ministers in nitish cabinet face criminal cases

Nitish-Tejashwi cabinet: బిహార్‭లో నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త మంత్రి వర్గంలో 72% మంది మంత్రులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్‭కి చెందిన పోల్ రైట్స్ బాడీ రిపోర్ట్ పేర్కొంది. మంగళవారం బిహార్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో 32 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏడీఆర్ తెలిపిన వివరా ప్రకారం.. అందులో 27 మంది (72శాతం) క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఇందులో 17 మంది మంత్రులు (53 శాతం) అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారట.

ఇక పోతే ఆర్జేడీకి చెందిన 15 మంది మంత్రులు (88 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ పేర్కొంది. ఇందులో 11 మంది (65) అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారట. ఆర్జేడీతో పోల్చుకుంటే జేడీయూకి చెందిన మంత్రులు కాస్త మెరుగ్గా ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. జేడీయూ నుంచి మొత్తం 11 మంది మంత్రులు ఉండగా.. ఇందులో నలుగురు మాత్రమే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారట. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు మంత్రులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారట.

2014లోని కిడ్నాప్ కేసులో మంత్రి కార్తికేయపై బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో మొత్తం 16కి భాగస్వామ్యం ఉన్నట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఇందులో మంత్రి కార్తికేయ, ఎమ్మెల్యే అనంత్ సింగ్ పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. వాస్తవానికి ఈ కేసులో ఆగస్టు 16నే దనపూర్ కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. అదే రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఉండడం వల్ల ఆయన హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.

Rohingya: రోహింగ్యాలకు ఇళ్లు ఇస్తామన్న మంత్రి హర్దీప్ సింగ్.. కాసేపటికే మంత్రికి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా కార్యాలయం