Rohingya: రోహింగ్యాలకు ఇళ్లు ఇస్తామన్న మంత్రి హర్దీప్ సింగ్.. కాసేపటికే మంత్రికి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా కార్యాలయం

అక్రమ రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వారికి ఢిల్లీలోని బక్కర్వాలా ప్రాంతంలో ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రోహింగ్యాలకు ఒక కొత్త ప్రదేశం కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే వారిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే కొనసాగించేలా హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. భారత విదేశాంగ శాఖతో హోంమంత్రిత్వ శాఖ పలు దఫాలు చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకుంది

Rohingya: రోహింగ్యాలకు ఇళ్లు ఇస్తామన్న మంత్రి హర్దీప్ సింగ్.. కాసేపటికే మంత్రికి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా కార్యాలయం

Centre On Russia Imports

Rohingya: రోహింగ్యాలకు పక్కా ఇళ్లు ఇస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటన చేసిన కాసేపటికే అమిత్ షా కార్యాలయం అయిన హోంమంత్రిత్వ శాఖ ఈ ప్రకటనను కొట్టి పారేసింది. అక్రమ విదేశీ శరణార్థులైన వారికి ఎలాంటి సౌకర్యాలు ప్రకటించలేదని బుధవారం హెచ్ఎంఓ స్పష్టం చేసింది. శరణార్థులకు ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని హర్దీప్ ప్రకటించగా.. కొద్ది గంటలకే హెచ్ఎంఓ దీనికి పూర్తి విరుద్ధ ప్రకటన చేయడం గమనార్హం.

రోహింగ్యాల వసతిపై ఓ వార్తా క్లిప్పును హర్దీప్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘దేశానికి వలసొచ్చే శరణార్థులకు భారత్ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంది. ఢిల్లీలోని బక్కర్వాలా ప్రాంతంలో రోహింగ్యా శరణార్థులందరికీ ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పించబడతాయి. అలాగే యూఎన్‭హెచ్‭సీఆర్ ఐడీ కార్డులతో పాటు 24 గంటలపాటు ఢిల్లీ పోలీసుల రక్షణ ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‭లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు.

ఇదే విషయమై ఆయన మరో ట్వీట్ చేస్తూ ‘‘భారతదేశ శరణార్థుల పాలసీని కొందరు ఉద్దేశపూర్వకంగా సీఏఏకి లింక్ చేస్తూ దుష్ప్రచారం చేసిన వారికి నిరాశ తప్పదు. 1951 నాటి ఐక్య రాజ్య సమితి శరణార్థుల పాలసీని భారతదేశం గౌరవిస్తుంది, అనుసరిస్తుంది. దీని కింద శరణార్థులందరికీ మతం, జాతితో సంబంధం లేకుండా ఆశ్రయం అందుతుంది’’ అని ట్వీట్ చేశారు. ఇందులో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, కేంద్ర పౌర సమాచార మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేశారు.

అయితే హర్దీప్ సింగ్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. శరణార్థులకు ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లతో పాటు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయమై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘అక్రమ రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వారికి ఢిల్లీలోని బక్కర్వాలా ప్రాంతంలో ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రోహింగ్యాలకు ఒక కొత్త ప్రదేశం కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే వారిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే కొనసాగించేలా హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. భారత విదేశాంగ శాఖతో హోంమంత్రిత్వ శాఖ పలు దఫాలు చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకుంది’’ అని హోంమంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది.

J&K congress: కాంగ్రెస్‭కు మరో షాక్.. ఆజాద్ అనంతరం మరో ముగ్గురు నేతల రాజీనామా