J&K congress: కాంగ్రెస్‭కు మరో షాక్.. ఆజాద్ అనంతరం మరో ముగ్గురు నేతల రాజీనామా

జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీని బుధవారమే ప్రకటించారు. ఇందులో పలువురికి చోటు ఇవ్వగా గులాం నబీ ఆజాద్‭ను ఆ కమిటీకి చెర్మన్‭గా నియమించారు. అయితే ఈ నిమాయకం జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం విశేషం. అలాగే జమ్మూ కశ్మీర్‭లోని రాజకీయ వ్యవహాలర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న ఈయన.. ఆ పదవికి కూడా రాజీనామా చేశారు.

J&K congress: కాంగ్రెస్‭కు మరో షాక్.. ఆజాద్ అనంతరం మరో ముగ్గురు నేతల రాజీనామా

Ghulam Nabi Azad resigns

J&K congress: జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన కొద్ది సమయానికే మరో ముగ్గురు కశ్మీర్ నేతలు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీకి రాజీనామా చేశారు. ఇందులో ఒకరు సోపోర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హజి అబ్దుల్ రషిద్ కాగా మరో ఇద్దరు మహ్మద్ భట్, గుల్జర్ అహ్మద్ వని. ఇంత తక్కువ వ్యవధిలో నలుగురు కీలక నేతలు పార్టీ వీడడంతో ఇప్పటికే కశ్మీర్‭లో అంతంతగానే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బని అంటున్నారు.

జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీని బుధవారమే ప్రకటించారు. ఇందులో పలువురికి చోటు ఇవ్వగా గులాం నబీ ఆజాద్‭ను ఆ కమిటీకి చెర్మన్‭గా నియమించారు. అయితే ఈ నిమాయకం జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం విశేషం. అలాగే జమ్మూ కశ్మీర్‭లోని రాజకీయ వ్యవహాలర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న ఈయన.. ఆ పదవికి కూడా రాజీనామా చేశారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన ఆజాద్.. చాలా కాలంగా కాంగ్రెస్ అదిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజ్యసభ పదవీ కాలాన్ని పొడగించకపోవడంతో పాటు బీజేపీ హిందుత్వ రాజకీయాల మూలంగా తనను పార్టీలో సైతం పక్కన పెట్టారనే అసంతృప్తి ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటూ తన అసంతృప్తిని తెలియజేస్తూనే వస్తున్నారు. ఈ తరుణంలో చాలా కాలం తర్వాత పార్టీ ఆయనకు పదవులు అప్పగించినప్పటికీ తన ఈసారి తన అసంతృప్తిని రాజీనామా ద్వారా తెలియజేయడం విశేషం.

Kartikeya Singh: బిహార్ మంత్రికి చేదు అనుభవం.. ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే అరెస్ట్ వారెంట్