Kartikeya Singh: బిహార్ మంత్రికి చేదు అనుభవం.. ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే అరెస్ట్ వారెంట్

‘‘నితీశ్ కుమార్ కేబినెట్ ఫొటో చూస్తే భయంకరంగా కనిపించింది. నేరాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు, న్యాయ స్థానాల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు కేబినెట్‭లో ఉన్నారు. వీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? చట్టాన్ని ఎలా రక్షిస్తారు?’’ అని బిహార్ బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ అన్నారు. కాగా, ఈ కేసు విషయమై తనకేమీ తెలియదని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Kartikeya Singh: బిహార్ మంత్రికి చేదు అనుభవం.. ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే అరెస్ట్ వారెంట్

New Bihar law minister Kartikeya Singh faces arrest in kidnapping case

Kartikeya Singh: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలకు కూడా గడవకముందే ఒక మంత్రిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అది కూడా న్యాయశాఖా మంత్రి మీదే జారీ కావడం విశేషం. బిహార్ న్యాయ శాఖ మంత్రి కార్తికేయ సింగ్‭కు ఎదురైన చేదు అనుభవం ఇది. మంగళవారమే బిహార్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి చెందిన కార్తికేయ న్యాయ శాఖ మంత్రిగా నితీశ్ కేబినెట్‭లో చేరారు.

కాగా, 2014లోని కిడ్నాప్ కేసులో మంత్రి కార్తికేయపై బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో మొత్తం 16కి భాగస్వామ్యం ఉన్నట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఇందులో మంత్రి కార్తికేయ, ఎమ్మెల్యే అనంత్ సింగ్ పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. వాస్తవానికి ఈ కేసులో ఆగస్టు 16నే దనపూర్ కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. అదే రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఉండడం వల్ల ఆయన హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.

ఈ విషయమై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘నితీశ్ కుమార్ కేబినెట్ ఫొటో చూస్తే భయంకరంగా కనిపించింది. నేరాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు, న్యాయ స్థానాల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు కేబినెట్‭లో ఉన్నారు. వీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? చట్టాన్ని ఎలా రక్షిస్తారు?’’ అని బిహార్ బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ అన్నారు. కాగా, ఈ కేసు విషయమై తనకేమీ తెలియదని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం.

HC on coronil: ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు: కోరోనిల్‭పై రాందేవ్‭కు హైకోర్టు వార్నింగ్