Property Transfer: ఆస్తి బదిలీ చేయాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందే.. తాజా సర్వేలో వెల్లడి!

దేశంలో ఆస్తుల బదిలీ ప్రక్రియ ఎంత కష్టమైందో తెలిసిందే. ఈ ప్రక్రియలో అనేక నిబంధనల్ని పాటించాలి. అందుకే ఈ విషయంలో దాదాపు 86 శాతం కుటుంబాలు లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుందని తాజా సర్వే ఒకటి తేల్చింది.

Property Transfer: ఆస్తి బదిలీ చేయాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందే.. తాజా సర్వేలో వెల్లడి!

Property Transfer: దేశంలో ఆస్తి బదిలీ చేయాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందే. ‘లోకల్ సర్కిల్స్’ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో తాజాగా వెల్లడైన విషయమిది. పొలం, ఇల్లు, భూమి వంటి స్థిరాస్తుల్ని, నగలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి చరాస్తుల్ని వేరే వారి పేరు మీద బదిలీ చేయడం దేశంలో ఒక క్లిష్టమైన ప్రక్రియ.

West Bengal: బాల్ అనుకుని బాంబుతో ఆడుకున్న చిన్నారులు.. ప్రమాదవశాత్తు పేలి బాలుడి మృతి

వేరే వారి దగ్గరి నుంచి ఆస్తుల్ని కొనుక్కుని, తమ పేరున రిజిష్టర్ చేసుకోవాలన్నా.. లేకపోతే.. తమ పేరు మీద ఉన్న ఆస్తుల్ని పిల్లలు, ఇతర వారసుల పేరు మీదకు మార్చాలన్నా చాలా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఇలా ఆస్తుల్ని ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చాలంటూ అనేక మంది ఆఫీసర్లు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ విషయంలో అనేక కుటుంబాలు లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. దాదాపు 86 శాతం కుటుంబాలు ఆస్తి బదిలీల విషయంలో లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుందని ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో తేలింది. కాగా, కనీసం 77 శాతం కుటుంబాలు ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు ఈ సర్వే తేల్చింది. ఆస్తులపై పూర్తి హక్కు కావాలంటే అనేక దశల్లో నిబంధనలు పాటించాలి. కచ్చితమైన నిబంధనల్ని పాటించినప్పుడే ఆస్తుల్ని ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న వాళ్లు పూర్తి హక్కుల్ని పొందగలరు.

Cyber Scam: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరిట సైబర్ మోసం… తొమ్మిది లక్షలు పోగొట్టుకున్న తమిళనాడు మహిళ

ఆస్తి బదిలీ ప్రక్రియలో అనేక సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన కొత్త రికార్డులు, పాత రికార్డులు సరితూగాలి. దీనికోసం న్యాయవాదులు సహా పలువురి సహాయం, వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ మరణించిన వారి ఆస్తి బదిలీ చేయాలంటే విల్లు రాసి ఉంటే ఈ ప్రక్రియ కాస్త త్వరగా అవుతుంది. లేదంటే చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తుల బదిలీ ప్రక్రియలో ఉన్న నిబంధనలు కష్టతరమైనవి. వీటిని పాటించే విషయంలో ఉన్న ఇబ్బందుల్ని అధిగమించాలంటే లంచాలు ఇవ్వకతప్పని పరిస్థితి తలెత్తుతోందని ఈ సర్వే తేల్చింది.