Cyber Scam: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరిట సైబర్ మోసం… తొమ్మిది లక్షలు పోగొట్టుకున్న తమిళనాడు మహిళ

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ లక్కీ డ్రాలో విజేతగా నిలిచావంటూ ఒక మహిళను నమ్మించారు సైబర్ కేటుగాళ్లు. రూ.35 లక్షల నగదు, బీఎండబ్ల్యూ కారు గెలిచావని, వీటిని సొంతం చేసుకోవాలంటే రూ.9 లక్షలు పన్నులు చెల్లించాలని సూచించారు. వెంటనే ఆమె వారు అడిగినంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది. మోసపోయింది.

Cyber Scam: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరిట సైబర్ మోసం… తొమ్మిది లక్షలు పోగొట్టుకున్న తమిళనాడు మహిళ

Cyber Scam: సైబర్ మోసాల గురించి ఎంత ప్రచారం కల్పిస్తున్నా కొందరు ఇంకా మోసపోతూనే ఉన్నారు. కనీస అవగాహన కూడా లేకుండా అకౌంట్లోని డబ్బంతా సైబర్ నేరగాళ్ల పాలు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఒక భారీ సైబర్ మోసం వెలుగు చూసింది.

WhatsApp: వాట్సాప్ సేవల పునరుద్ధరణ.. రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరుతో ఒక మహిళ నుంచి రూ.9 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. తమిళనాడు, తిరుచ్చి పట్టణం, మసీదు వీధికి చెందిన అనీషా అమల్ అనే మహిళకు ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి ఇటీవల ఒక కాల్ వచ్చింది. ఆమె ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ లక్కీ డ్రాలో విజేతగా నిలిచినట్లు సైబర్ కేటుగాళ్లు చెప్పారు. దీనిలో భాగంగా ఆమెకు రూ.35 లక్షల నగదు, ఒక లగ్జరీ బీఎండబ్ల్యూ కారు గెలుచుకున్నట్లు నమ్మించారు. అయితే, ఈ బహుమతులు సొంతం చేసుకోవాలంటే రూ.9,39,500 పన్నులు చెల్లించాలని సూచించారు. వీటిని ఆర్బీఐకి చెల్లిస్తామని, ఆ తర్వాత బహుమతి అందిస్తామని నమ్మించారు. ఇది నిజమేనని నమ్మిన అనీషా వాళ్లు అడిగినట్లుగానే ఆ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది.

West Bengal: బాల్ అనుకుని బాంబుతో ఆడుకున్న చిన్నారులు.. ప్రమాదవశాత్తు పేలి బాలుడి మృతి

సైబర్ కేటుగాళ్లు సూచించిన అకౌంటుకు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే, ఆమెకు ఎలాంటి బహుమతులు రాకపోవడంతో తను మోసపోయినట్లు గుర్తించింది. తర్వాత తిరుచ్చి మెట్రో పాలిటన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.