Little Girl Street Dance: వావ్ అందరగొట్టింది.. జానపద నృత్యకారులతో డ్యాన్స్ చేసిన చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు

చిన్న పిల్లలు చేసే సరదా చేష్టలు నవ్వులు పూయిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ చిన్నారి తన నృత్యంతో నెటిజన్లను ఫిదా చేసింది.

Little Girl Street Dance: వావ్ అందరగొట్టింది.. జానపద నృత్యకారులతో డ్యాన్స్ చేసిన చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు

Viral Video

Little Girl Street Dance: చిన్న పిల్లలు చేసే సరదా చేష్టలు నవ్వులు పూయిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ చిన్నారి తన నృత్యంతో నెటిజన్లను ఫిదా చేసింది. ఆ చిన్నారి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కర్ణాటకలోని ఉడిపిలో సాంప్రదాయ నృత్యంను వీధిలో ప్రదర్శిస్తున్నారు. వీరితో కలిసి ఓ చిన్నారి నృత్యం చేసింది.

King Cobra: వామ్మో.. కింగ్ కోబ్రాతోనే ఆటలా.. అంతతేలిగ్గా ఉండదు.. వీడియోచూసి నెటిజన్లు ఏమన్నారంటే..

ఈ వీడియోను ట్విటర్ లో విజిట్ ఉడిపీ అనే ఖాతాదారు పోస్టు చేశారు. ఈ వీడియోలో కర్ణాటక ఉడిపి సాంప్రదాయంలో నృత్య కళాకారులు తమ కళను రోడ్డుపై ప్రదర్శిస్తున్నారు. ఒక మహిళ చిన్నారితో కలిసి ఒక నృత్యకారుడి వద్దకు వెళ్లింది. అతని ప్రదర్శన మెచ్చి పూలమాలతో గౌరవించింది. అనంతరం చిన్నారిని నృత్యకారుడితో డ్యాన్స్ వేయమని చెప్పింది. దీంతో ఆ చిన్నారి నరక్తితో కలిసి స్టెప్పులు వేసింది. చిన్నారి వేసే స్టెప్పులను చూసి స్థానికులు చప్పట్లతో ప్రోత్సహించారు. నృత్యకారుడు నృత్యాన్ని అనుసరిస్తూ ఆ చిన్నారి వేసిన స్టెప్పులకు స్థానికులు ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను విజిట్ ఉడిపి అనే ఖాతాదారు తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీనికి ఓ మైగాడ్.. ఇది చాలా అందంగా ఉంది అని శీర్షక ఇచ్చాడు.

ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 5.6 లక్షల మందికిపైగా వీక్షించారు. 31,000 కంటే ఎక్కువ లైక్ లు వచ్చాయి. 3,500 మంది నెటిజన్లు ఈ పోస్టును మెచ్చి రీ ట్వీట్లు చేశారు. ఈ చిన్నారి నృత్యం ఎంతో చూడముచ్చటగా ఉంది అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరికొందరు నెటిజన్లు ఈ చిన్నారి నృత్యాన్ని చూసి ఫిదా అవుతూ రీ ట్వీట్లు చేశారు.