Aha Godari : ఢిల్లీలో ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీ ప్రదర్శన

aha Godari: గోదావరి గురించి మనకే తెలియని ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయని వెల్లడించారు. హిందువులకు మాత్రమే కాదు అనేక మతస్తులకు గోదావరితో అనుబంధం ఉందన్నారు.

Aha Godari : ఢిల్లీలో ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీ ప్రదర్శన

Aha Godari(Photo : Google)

Aha Godari Documentary : ఢిల్లీ ఏపీ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆహా గోదారి డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ప్రదర్శనకు ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది, ఢిల్లీలోని తెలుగు ప్రజలు హాజరయ్యారు. గోదావరి నది, చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలపై ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాన్ని అందించే కంటెంట్ తీసుకొస్తుంది. తొలిసారిగా సమాచారంతో కూడిన ‘ఆహా గోదారి’ డాక్యుమెంటరీని శ్రీరామనవమి సందర్భంగా తీసుకొచ్చామని ఆహా పీఆర్ఓ అభ్యుదయ తెలిపారు.

Pawan Kalyan : టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ- పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

స్వాతి దివాకర్ ఈ డాక్యుమెంటరీని మూడేళ్లు కష్టపడి రూపొందించారన్నారు. గోదావరి గురించి మనకే తెలియని ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయని వెల్లడించారు. కేవలం హిందువులకు మాత్రమే కాదు అనేక మతస్తులకు గోదావరితో అనుబంధం ఉందన్నారు. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాలంటూ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ ఆహ్వానించినట్లు తెలిపారు. ‘ఆహా గోదారి’ ప్రదర్శనతో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మొదటిసారి డాక్యుమెంటరీ ప్రదర్శన జరిగిందన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపీ భవన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఆహా పీఆర్ఓ అభ్యుదయ .