Jayalalithaa Death Case: మాజీ సీఎం జయలలిత చికిత్సలో అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన ఎయిమ్స్

జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న అరుముగస్మావి కమిషన్‭కు సాయం అందించేందుకు ఎయిమ్స్ ప్యానెల్‭ను సుప్రీం కోర్టు నియమించింది. కాగా, ఈ ప్యానెల్ తాజాగా తన నివేదికను వెల్లడిస్తూ ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి తప్పులు జరగలేదని, సరైన వైద్య విధానం ప్రకారమే చికిత్స అందిందని తెలిపింది. దీంతో జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రికి ఊరట లభించినట్లైంది.

Jayalalithaa Death Case: మాజీ సీఎం జయలలిత చికిత్సలో అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన ఎయిమ్స్

AIIMS clarifies no errors in jayalalitha death case

Updated On : August 21, 2022 / 7:44 PM IST

Jayalalithaa Death Case: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్సలో లోపాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఎయిమ్స్ క్లారిటీ ఇచ్చింది. చికిత్సలో ఎలాంటి లోపాలు లేవని తాజాగా వెల్లడించిన నివేదికలో ఎయిమ్స్ స్పష్టం చేసింది. జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న అరుముగస్మావి కమిషన్‭కు సాయం అందించేందుకు ఎయిమ్స్ ప్యానెల్‭ను సుప్రీం కోర్టు నియమించింది. కాగా, ఈ ప్యానెల్ తాజాగా తన నివేదికను వెల్లడిస్తూ ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి తప్పులు జరగలేదని, సరైన వైద్య విధానం ప్రకారమే చికిత్స అందిందని తెలిపింది. దీంతో జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రికి ఊరట లభించినట్లైంది.

అనారోగ్యంతో అపోలో ఆసుపత్రితో చేరిన జయలలిత.. నెల రోజులకు పైగా కొనసాగిన చికిత్స అనంతరం డిసెంబరు 2016లో మరణించారు. ఆ తర్వాత ఆమె మరణంపై రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమెకు అందించిన చికిత్సపై పలు పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో జయ మరణంపై విచారణ జరిపించాల్సిందిగా అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం చేసిన విజ్ఞప్తితో అరుముగస్వామి కమిషన్ ఏర్పాటైంది. నవంబరు 2017 నుంచి కమిషన్ పని ప్రారంభించింది. జయలలిత సన్నిహితులను, ఆమెకు చికిత్స అందించిన వైద్యులను, అప్పటి తమిళనాడు ఆరోగ్యమంత్రి విజయభాస్కర్, అప్పటి ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, ఆర్థిక మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఒ. పన్నీర్‌సెల్వం తదితరులను విచారించింది.

మొత్తంగా 157 మంది కమిషన్ ఎదుట హాజరై జయలలిత మరణానికి సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించారు. జయలలితకు ఆరోగ్యానికి సంబంధించిన ఫైనల్ డయాగ్నసిస్, టైమ్‌లైన్ ఈవెంట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ప్యానల్.. అపోలో ట్రీట్‌మెంట్, డయాగ్నిసిస్‌తో పూర్తిగా ఏకీభవించింది. అపోలో మెడికల్ రిపోర్ట్స్‌‌ను పరిశీలించిన ప్యానల్ .. హార్ట్ ఫెయిల్యూర్ అయినట్టు కూడా గుర్తించింది ఆమె ఆసుపత్రిలో చేరినప్పటికే మధుమేహం నియంత్రించలేని స్థితిలో ఉందని, దానికి చికిత్స అందించారని కమిషన్ గుర్తించింది. దీనికితోడు హైపర్‌టెన్షన్, హైపర్‌థైరాయిడ్, ఆస్థమా, ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్, అటోపిక్ డెర్మాటిటిస్ ఉన్నాయని ప్యానెల్ గుర్తించింది. అపోలో ఫైనల్ డయాగ్నసిస్‌తో తాము పూర్తిగా ఏకీభవించినట్టు ఎయిమ్స్ ప్యానల్ స్పష్టం చేసింది.

Meira Kumar: ఈ దేశానికి పట్టిన జబ్బు కులం.. మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ స్పీకర్