Meira Kumar: ఈ దేశానికి పట్టిన జబ్బు కులం.. మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ స్పీకర్
ఏ ఒక్కరి పాలనో, ఏ ఒక్క పార్టీనో దీనికి బాధ్యత వహించలేదు. ఇది ఈ దేశం యొక్క బాధ్యత. దేశంలోని సమాజం, పౌరులందరి ఉమ్మడి బాధ్యత. ఆ పార్టీ బాధ్యతని, ఆ కమ్యూనిటీ బాధ్యతని, ఈ రాష్ట్రంలో ఇన్ని జరిగాయని, ఈ రాష్ట్రంలో అంత శాతమని.. ఇలాంటి తేడాలు, చర్చలు అసలు సమస్యను పక్కదారి పట్టించడానికే. వీటికి అతీతంగా సమస్యను చూసినప్పుడే పరిష్కారం వైపు అడుగులు పడతాయి.

Need to completely eradicate caste system says Meira Kumar
Meira Kumar: రాజస్తాన్లో తొమ్మిదేళ్ల పాఠశాల విద్యార్థి మరణంపై స్పందిస్తూ కుల వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత మీరా కుమార్.. మరోసారి కుల వ్యవస్థ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దేశంలో కుల వ్యవస్థ ఒక జబ్బని, దీనిని వ్యవస్థ నుంచి పూర్తిగా తొలగించాలని ఆమె అన్నారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇన్నేళ్లు గడిచినా కుల వ్యవస్థలో మార్పు రాలేదని, దీనిని దేశం నుంచి పారదోలాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
అయితే రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పాలన కారణంగానే ఇలా జరుగుతుందా అని మీరా కుమార్ను ప్రశ్నించగా ‘‘ఈ మాట నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను ఏ ఒక్క పార్టీని వెనకేసుకు రావడం లేదు. అలా అని ఎవరినీ నిందించడం లేదు. కానీ దీనికి మొత్తం రాజకీయ వ్యవస్థ బాధ్యత వహించాలి. ఎందుకంటే సమాజంపై రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది’’ అని అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘ఏ ఒక్కరి పాలనో, ఏ ఒక్క పార్టీనో దీనికి బాధ్యత వహించలేదు. ఇది ఈ దేశం యొక్క బాధ్యత. దేశంలోని సమాజం, పౌరులందరి ఉమ్మడి బాధ్యత. ఆ పార్టీ బాధ్యతని, ఆ కమ్యూనిటీ బాధ్యతని, ఈ రాష్ట్రంలో ఇన్ని జరిగాయని, ఈ రాష్ట్రంలో అంత శాతమని.. ఇలాంటి తేడాలు, చర్చలు అసలు సమస్యను పక్కదారి పట్టించడానికే. వీటికి అతీతంగా సమస్యను చూసినప్పుడే పరిష్కారం వైపు అడుగులు పడతాయి. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదంటారు. కానీ కుల వ్యవస్థలను ఎంతమాత్రం సహించేది లేదని ఎవరూ అనరు. దీని కోసం సమాజమే ముందుకు కదలాలి’’ అని అన్నారు.
CBI raids: ఒకే సమయంలో సీబీఐ అలా ఎలా కనిపిస్తోంది? కాంగ్రెస్ తీరుపై ఒమర్ అబ్దుల్లా విమర్శలు