Air India : టాటాల చేతుల్లోకి ఎయిరిండియా.. ముహూర్తం ఫిక్స్

ఎయిరిండియా మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. దీంతో 100 శాతం వాటాలు పొందేందుకు రూ. 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది....

Air India : టాటాల చేతుల్లోకి ఎయిరిండియా.. ముహూర్తం ఫిక్స్

Air India (2)

Air India – Tata: ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల పరం కానుంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. 2022, జనవరి 27వ తేదీన ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానుంది. సంస్థకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం టాటా గ్రూప్ నకు అప్పగించనున్నట్లు తెలిపింది. జనవరి 27వ తేదీ నుంచి ఎయిరిండియా నిర్వహణ టాటాలు అందుకోవడం జరుగుతుందని ఎయిరిండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాది సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా తెలియచేశారని తెలుస్తోంది. ఎయిరిండియాతో రాకతో టాటా గ్రూప్ లోకి మూడో విమానాయన బ్రాండ్ వచ్చినట్లవుతుంది. ఇప్పటికే విస్తారా, ఎయిరేషియా ఇండియాలో టాటా సంస్థకు మెజార్టీ వాటాలున్న సంగతి తెలిసిందే.

Read More : BIO Convention : ఫిబ్ర‌వ‌రి 24, 25న బయో ఆసియా స‌ద‌స్సు.. ఈసారి వర్చువల్ ఫార్మాట్‌లో..!

ఎయిరిండియా మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. దీంతో 100 శాతం వాటాలు పొందేందుకు రూ. 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. గత సంవత్సరం అక్టోబర్ 08వ తేదీన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అదే నెల 11వ తేదీన ఈ బిడ్డింగ్ ను ధృవీకరిస్తూ..కేంద్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను సైతం జారీ చేసింది. ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ మిగిలి ఉందని, ఇది…రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ నెలాఖరులోపు…ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానున్నాయి. ఎయిర్ ఇండియా అసలు పేరు టాటా ఎయిర్ లైన్స్. 1932లో టాటా ఎయిర్ లైన్స్ ను పారిశ్రామిక దిగ్గజం JRD టాటా స్ధాపించగా, స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయీకరణ చేసింది. దీని పేరును ఎయిర్ ఇండియాగా మార్చింది. 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది.