#IndependenceDay speech: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం

#IndependenceDay speech: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం

Assam to withdraw 1 lakh minor cases announces CM on Independence Day

#IndependenceDay speech: కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల్లో సుమారు లక్ష కేసుల వరకు ఉపసంహరించుకోనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. సోమవారం స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జెండా ఎగరవేసిన అనంతరం అస్సాం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. అయితే పెద్ద కేసుల జోలికి పోకుండా మైనర్ కేసులను మాత్రమే ఉపసంహించుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో అన్నీ కోర్టులో చాలా కాలంగా పెండింగ్‭లో ఉన్నవేనట.

పెండింగ్ కేసుల కారణంగా న్యాయవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఆ భారాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు. అస్సాం కోర్టుల్లో సుమారు 4 లక్షల కేసులు పెండింగ్‭లో ఉన్నాయి. స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం బిశ్వా శర్మ మాట్లాడుతూ ‘‘ఈ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించాలని మా ప్రభుత్వం భావించింది. ఒక లక్ష కేసులను ఉపసంహరించుకోవాలని మేం నిర్ణయించాం. ఇవన్నీ మైనర్ కేసులు. ఇందులో రేప్చ, మర్డర్ లాంటి కేసులు ఉన్నాయి’’ అని అన్నారు.

ఇక స్వాతంత్ర్య సమర యోధులు గొప్ప హీరోలని, వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని హిమంత బిశ్వా శర్మ అన్నారు. ఇక దేశంలో చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అస్సాంలో విజయవంతమైందని, స్వయం-సహాయ గ్రూపుల ద్వారా 17 కోట్ల మందికి 42 లక్షల త్రివర్ణ పతాకాలు అందినట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Bihar: ఎన్నికల వేళ తేజస్వీ యాదవ్ ఇచ్చిన హామీని నెరవేర్చనున్న నితీశ్ కుమార్