Nandigram Mamata : దీదీ డబుల్ సెంచరీ, నందిగ్రామ్‌లో పుంజుకుంది

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా సాగుతోంది. సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. టీఎంసీ డబుల్ సెంచరీ కొట్టింది. రాష్ట్రంలో

Nandigram Mamata : దీదీ డబుల్ సెంచరీ, నందిగ్రామ్‌లో పుంజుకుంది

Nandigram Mamata

Nandigram Mamata : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా సాగుతోంది. సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. టీఎంసీ డబుల్ సెంచరీ కొట్టింది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల్లో 200లకు పైగా స్థానాల్లో టీఎంసీలో లీడ్ లో ఉంది. దీంతో బెంగాల్ లో టీఎంసీ నేతలు గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీదీకి గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ.. 86 స్థానాల్లో అధిక్యంతో రెండో స్థానంలో ఉంది. కాగా, గతంతో పోలిస్తే బీజేపీ బలంగా పుంజుకుంది. 2016లో మూడు స్థానాలతోనే సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి బాగా పుంజుకుంది.

మరోవైపు నందిగ్రామ్ లో వెనుకంజలో ఉన్న సీఎం మమతా బెనర్జీ.. మళ్లీ పుంజుకున్నారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి అధిక్యం 4వేల ఓట్లకు తగ్గింది.

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో ఎన్నికలు జరిగాయి. కాగా, అందరి చూపు అట్రాక్ట్ చేసింది మాత్రం వెస్ట్ బెంగాల్ ఎన్నికలే. ఇక్క టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడిచింది.