‘Snake Entered Your House Lalu Ji..’ : లాలూ జీ..మీరు చెప్పిన పామే మీ ఇంట్లోకి వచ్చింది’ : నితీష్ పై బీజేపీ నేత సెటైర్

లాలూ జీ..మీరు చెప్పిన పామే మీ ఇంట్లోకి వచ్చింది’ అంటూ నితీష్ కుమార్ పై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సెటైర్ వేశారు.

‘Snake Entered Your House Lalu Ji..’ : లాలూ జీ..మీరు చెప్పిన పామే మీ ఇంట్లోకి వచ్చింది’ : నితీష్ పై బీజేపీ నేత సెటైర్

‘Snake has entered your house Lalu ji’, Giriraj tweet

‘Snake has entered your house Lalu ji’, Giriraj tweet : బీహార్ లో రాజకీయాలు ఎవ్వరూ ఊహించని విధంగా మారిపోయాయి. ఎన్డీయే జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ కాషాయ పార్టీకి కటీఫ్ చెప్పారు. దీంతో బీహార్ లో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.అనూహ్యంగా నితీశ్ కుమార్ ఆర్డేడీ, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలతో జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఆర్జేడీతోవిడిపోయారు నితీష్ కుమార్. ఆ సమయంలో నితీశ్ ను ఉద్ధేశించి లాలూ ప్రసాద్ యాదవ్ ఓ ట్వీట్ చేస్తూ..నితీష్ ఓ పాము అంటూ పేర్కొన్నారు.

తాజాగా బీజేపీకి బ్రేకప్ చెప్పి అదే ఆర్జేడీతో జత కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటానికి నితీష్ సిద్ధంగా ఉన్నారు. ఈక్రమంలో బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ గతంలో లాలా ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ..‘లాలూజీ మీ ఇంట్లోకి పాము ప్రవేశించింది’అంటూ ట్వీట్ చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాత ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ నితీశ్‌కుమార్‌పై బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లాలూ జీ మీ ఇంట్లోకి పాము ప్రవేశించింది’ అంటూ గిరిరాజ్ ట్వీట్‌ చేశారు.

2017లో నితీశ్‌కుమార్‌ ఆర్జేడీతో విడిపోయిన సమయంలో లాలూ ఓ ట్వీట్‌లో నితీశ్ ఓ పాము అనీ, పాము కుబుసాన్ని వదిలి కొత్త చర్మాన్ని తొడుగినట్లు.. నితీశ్‌ కూడా ప్రతి రెండేళ్లకోసారి కూటమిని మారుస్తారని..ఇందులో ఎవరికైనా అనుమానం ఉందా? అంటూ ట్వీట్‌ చేశారు. నిషేధ చట్టానికి సంబంధించి గిరిరాజ్‌ సింగ్‌ మరో ట్వీట్‌లో జేడీయూ లక్ష్యంగా విమర్శలు సంధించారు.

బిహార్‌లో మద్యపాన నిషేధం తర్వాత బిహార్‌ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా లిక్కర్‌ మాఫీయాకే వెళ్తుందని..జేడీయూ తన పార్టీని బతికించుకోవటానికి ఉపయోగిస్తోందని విమర్శించారు. ఈ రోజు నిషేధచట్టం తొలగిపోతుదని, రేపు జేడీయూ ముగుస్తుందని అన్నారు. నిషేధం తర్వాత..JDU విరాళాల సేకరణలో అపూర్వమైన పెరుగుదల ఉందంటూ ఆరోపించారు. నితీశ్‌ అందరి వాడు కాదని, కేవలం కుర్చీకే చెందినవాడు అంటూ సెటైర్ వేశారు.