BJP apologises: కార్యక్రమం రద్దు చేసిన కోహిమా బాప్టిస్ట్ చర్చి.. క్షమాపణలు చెప్పిన బీజేపీ

వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రానికి నడ్డా వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని కాస్త ముందుగానే ప్రారంభించి, పార్టీ నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాగాలాండ్‭లో ఎక్కువ మంది క్రైస్తవులను ఆకట్టుకోవడానికి కోహిమా బాప్టిస్ట్ చర్చికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే రహస్యంగా ఉండాల్సిన ఈ పర్యటన గురించి బయటికి లీకు కావడంతో ఈ పర్యటనను చర్చి రద్దు చేసింది.

BJP apologises: కార్యక్రమం రద్దు చేసిన కోహిమా బాప్టిస్ట్ చర్చి.. క్షమాపణలు చెప్పిన బీజేపీ

BJP apologises to Kohima Baptist Church for inaccurate reports about JP Nadda visit

BJP apologises: జయ ప్రకాష్ నడ్డా పర్యటనకు సంబంధించిన వార్తలు బయటికి లీక్ కావడంతో నాగాలాండ్‭లోని కోహిమా బాప్టిస్ట్ చర్చికి భారతీయ జనతా పార్టీ క్షమాపణలు చెప్పింది. దీనికి ముందు బీజేపీ అధినేత జేపీ నడ్డా నాగాలాండ్ పర్యటనపై కొన్ని లీకులు బయటకి వచ్చాయి. నాగాలాండ్ పర్యటనలో భాగంగా ఆయన కోహిమా బాప్టిస్ట్ చర్చిని సందర్శించనున్నారని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు ప్రచురితం అయ్యాయి.

అయితే ఈ పర్యటన అత్యంత రహస్యంగా ఉండాలని చర్చి యాజమాన్యం ముందే చెప్పింది. అయినప్పటికీ బయటికి లీక్ కావడంతో.. నడ్డా పర్యటన కార్యక్రమాన్ని రద్దు చేసింది. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం చర్చికి బీజేపీ క్షమాపణలు చెబుతూ ఒక లేఖను విడుదల చేసింది.

‘‘కోహిమా బాప్టిస్ట్ చర్చికి ఉన్న మంచి పేరును ప్రచారానికి ఉపయోగించుకునే దురుద్దేశం మాకు లేదు. చర్చి సెంటిమెంటును, గౌరవాన్ని మేము గుర్తిస్తాం, గౌరవిస్తాం. బీజేపీ కార్యక్రమాన్ని రద్దు చేసే కారణం చాలా నిజాయితీతో కూడినది. చర్చిలో ఇతర కార్యక్రమాలు ఉండడం మూలంగా బీజేపీ కార్యక్రమానికి అవకాశం లభించలేదు’’ అని గురువారం చర్చికి రాసిన లేఖలో బీజేపీ పేర్కొంది.

వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రానికి నడ్డా వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని కాస్త ముందుగానే ప్రారంభించి, పార్టీ నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాగాలాండ్‭లో ఎక్కువ మంది క్రైస్తవులను ఆకట్టుకోవడానికి కోహిమా బాప్టిస్ట్ చర్చికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే రహస్యంగా ఉండాల్సిన ఈ పర్యటన గురించి బయటికి లీకు కావడంతో ఈ పర్యటనను చర్చి రద్దు చేసింది.

Nirmala Sitharaman: తమిళనాడులో పుట్టాను.. అందుకే హిందీలో మాట్లాడాలంటే భయం