Pakistan : పాక్ నయా ప్లాన్, డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా

జమ్మూ కాశ్మీర్ లో భారత బలగాలు ఉగ్రవాదులను ఏరి వేస్తున్నాయి. మరోపక్క ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధంగా పాక్ ప్రయత్నిస్తోంది.

Pakistan : పాక్ నయా ప్లాన్, డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా

Drone pak

BSF : పాకిస్తాన్ ఓ వైపు స్నేహం కోసం నటిస్తూ మరోవైపు కుతంత్రాలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతూ..తూట్లు పొడుస్తోంది. అంతర్జాతీయ సరిహద్దులో ఆయుధాలను జార విడుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించడానికి భారీ స్కెచ్ వేస్తోంది.

డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయాలని చూస్తోంది. సాంబా సెక్టార్ లో డ్రోన్ల ద్వారా..ఆయుధాలను పాక్ జార విడిచింది. అయితే..పాక్ పన్నాగాన్ని ఎప్పటిలాగానే..భారత బలగాలు తిప్పి కొట్టాయి. పాక్ జారవిడిచిన ఆయుధాల కవర్ ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. అందులో ఏకే 47 రైఫిల్, 9ఎంఎం పిస్టల్, 15 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది.

జమ్మూ కాశ్మీర్ లో భారత బలగాలు ఉగ్రవాదులను ఏరి వేస్తున్నాయి. మరోపక్క ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధంగా పాక్ ప్రయత్నిస్తోంది. సరిహద్దుల్లోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు ఉగ్రవాదులు. అయితే..వీరి ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొడుతోంది. ప్రస్తుతం అత్యంత మెరుగైన టెక్నాలజీని వాడాలని భావిస్తోందని సమాచారం.

అందులో భాగంగా..డ్రోన్ల ద్వారా ఆయుధాలను ఉగ్రవాదులకు సరఫరా చేయాలని నయా ప్లాన్ రచించింది. 10 నుంచి 20 కిలోల బరువున్న ఆయుధాలను డ్రోన్ల ద్వారా జార విడిచారు. వీటిని బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకోవడంతో..పాక్ ప్రయత్నాలను తిప్పికొట్టినట్లైంది. ఇంకా ఏమైనా..జార విడిచిందా ? అనే దానిపై తనిఖీలు చేపడుతున్నారు.

Read More : కరోనా సమయంలో జియో యూజర్లకు గుడ్ న్యూస్..