CJI Chandrachud: ప్రపంచం మొత్తాన్ని మోసం చేయవచ్చు, కానీ మన మనస్సాక్షిని చేయలేం.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

చిత్తశుద్ధి తుఫాను వల్ల నాశనం అయ్యేది కాదు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇచ్చే చిన్న రాయితీలు, వారి నిజాయితీతో నిర్మించబడినవి. వాటిని కూడా తొలగించలేం. కానీ కొన్ని ఒప్పందాలు వాటిని కూడా ధ్వంసం చేయవచ్చు

CJI Chandrachud: ప్రపంచం మొత్తాన్ని మోసం చేయవచ్చు, కానీ మన మనస్సాక్షిని చేయలేం.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated On : September 17, 2023 / 8:53 PM IST

CJI Chandrachud: ప్రపంచం మొత్తాన్ని మోసం చేయవచ్చమే కానీ, మన మనస్సాక్షిని మోసం చేయలేమంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మనం చిత్తశుద్ధిని కాపాడుకున్నామా లేదా అన్నదానిపైనే మన వృత్తి అభివృద్ధి చెందుతుందా లేక ఆత్మన్యూనత చెందుతుందా అనేది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

‘లాయర్లు, న్యాయమూర్తుల మధ్య సహకారాన్ని పెంపొందించడం.. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి దిశలు’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘చిత్తశుద్ధి తుఫాను వల్ల నాశనం అయ్యేది కాదు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇచ్చే చిన్న రాయితీలు, వారి నిజాయితీతో నిర్మించబడినవి. వాటిని కూడా తొలగించలేం. కానీ కొన్ని ఒప్పందాలు వాటిని కూడా ధ్వంసం చేయవచ్చు’’ అని అన్నారు.

Telangana Politics: భారతమాత అవతారంలో సోనియా గాంధీ.. తుక్కుగూడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్

‘‘మనమందరం మనస్సాక్షితో నిద్రపోతున్నాం. మీరు మొత్తం ప్రపంచాన్ని మోసం చేయవచ్చు, కానీ మీరు మీ మనస్సాక్షిని మోసం చేయలేరు. న్యాయవాద వృత్తిలో నిజాయితీ ప్రధానమైనది. నిజాయితీతో మనం బ్రతుకుతాం లేదా మనల్ని మనం నాశనం చేసుకుంటాం’’ అని సీజేఐ అన్నారు. కాగా, న్యాయవ్యవస్థలో మహిళల సమస్యలపై కూడా సీజేఐ చర్చించారు. లింగభేదం అనేది కేవలం స్త్రీ సమస్య మాత్రమే కాదని, ఇది పురుషుల సమస్య అని ఆయన అన్నారు. భారతీయ న్యాయవాద వృత్తి ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సవాలు సమాన అవకాశాల వృత్తిని సృష్టించడమని తాను నమ్ముతున్నానని అన్నారు. ఎందుకంటే నేటి న్యాయవాద వృత్తి యొక్క నిర్మాణం 30 లేదా 40 సంవత్సరాల తర్వాత దానిని నిర్వచిస్తుందని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.