కాలుష్య నివారణకు Air purifier robot కనిపెట్టిన కాన్పూర్ విద్యార్ధులు

  • Published By: Chandu 10tv ,Published On : November 11, 2020 / 01:30 PM IST
కాలుష్య నివారణకు Air purifier robot కనిపెట్టిన కాన్పూర్ విద్యార్ధులు

Kanpur students invent air purifier robot mission : భారత్ లో వివిధ రాష్ట్రాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. రోజు రోజుకు దేశంలో గాలి కాలుష్యం పెరిగిపోతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు కాలుష్య నివారణకు మార్గాలతో పాటు ఎయిర్ ఫిల్టర్ పై ఆసక్తి కనపరుస్తున్నారు. తాజాగా కాన్పూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి ఒక ప్రత్యేకమైన రోబోను అభివృద్ధి చేశాడు. ఇది వాతావరణం నుంచి కలుషితమైన గాలి కణాలను పీల్చుకుని, అనంతరం స్వచ్ఛమైన గాలిని అందించే ఎయిర్ ప్యూరిఫయర్‌ మిషెన్ గా పనిచేస్తుంది.



కాన్పూర్ కు చెందిన ప్రాంజల్ అనే ఇంటర్ విద్యార్థి ఈ ఎయిర్ ప్యూరిఫయర్ రోబో మిషెన్ ను కనిపెట్టాడు. ప్రంజల్ తన క్లాస్‌మేట్ ఆరేంద్రతో కలిసి ఈ సరికొత్త రోబోను అభివృద్ధి చేసినట్లు చెప్పాడు. దీనిలో గాలిని శుద్ధి చేసే యంత్రం అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా వాతావరణంలో పెరిగిపోతున్నా వాయు కాలుష్యాన్ని వేరు చేసి, స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రయోగం చేశామని వారు చెబుతున్నారు. అవసరమైతే తన ఈ ఆవిషర్కణపై కొంతమంది సీనియర్ శాస్త్రవేత్తలను కలిసి, దీని మెరుగుపరిచే ఆలోచనలో ప్రాంజల్ ఉన్నట్లు తెలుస్తోంది.



అందుకోసం ఈ మిషన్ డివైజ్లో ప్యూరిఫైయర్ ని ఏర్పాటు చేశామని తెలిపాడు. ఈ రోబో కలుషితమైన గాలిని ఫిల్టర్ చేస్తోంది. రోబో పనిచేసేటప్పుడు లోపల ఉన్న ఎయిర్ ఫిల్టర్ వాతావరణంలో కలుషితమైన గాలి కణాలను లోపలికి పీల్చుకుని, అనంతరం స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది. కలుషితమైన గాలి కణాలు ఆ ఫిల్టర్ లోనే ఉండేలా రోబోను డిజైన్ చేశామని వెల్లడించారు. చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభను కనపరిచిన విద్యార్ధులను పలువురు అభినందిస్తున్నారు.




https://10tv.in/video-of-robot-pulling-a-rickshaw-goes-viral/
కాన్పూర్ పాఠశాల ప్రిన్సిపాల్ పూజా అవస్థీ మాట్లాడుతూ… ప్రాంజల్ తమ ముందు ఈ రోబోను ప్రదర్శించినప్పుడు మేము ఆశ్చర్యపోయాయని అన్నారు. ప్రాంజల్ మా భవిష్యత్తు శాస్త్రవేత్త. అతడు స్కూల్‌ ల్యాబ్‌లో కూడా ఇతరులకు సహాయం చేస్తుంటాడు. మా విద్యార్థి సాధించిన విజయం పట్ల మేము చాలా గర్వపడుతున్నాం. ఇటీవల కాలంలో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. ఇవన్నీ చూస్తే, ప్రాంజల్ ఆవిష్కరణ చాలా విలువైనదిగా అనిపిస్తుందని అవస్థీ తెలిపారు.