అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్రం కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్(ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్) బ్యాన్ చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా ప్లాస్టిక్

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 01:21 PM IST
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్రం కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్(ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్) బ్యాన్ చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా ప్లాస్టిక్

దేశవ్యాప్తంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్(ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్) బ్యాన్ చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా ప్లాస్టిక్ బ్యాన్ కు సంబంధించి ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సహా అన్ని ఈ-కామర్స్ సంస్థలు.. వస్తువులను ప్యాకింగ్ చేసే సమయంలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల(సింగిల్ యూజ్ ప్లాస్టిక్)ను వాడొద్దని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సూచించింది. దశల వారీగా దీన్ని అమలు చేయాలంది. దానికి తోడు ఎక్కువకాలం మన్నేలా ఉండే ప్లాస్టిక్ సాయంతో ప్యాకింగ్ లు చేయాలని డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కోరింది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వీలైనంత తగ్గించడమే తన ప్రధాన కర్తవ్యం అని కేంద్రం తెలిపింది. ఈ-కామర్స్ వేదికగా సేల్ చేసే వస్తువులను డెలివరీ చేసే సమయంలో ప్లాస్టిక్ వాడకాన్ని క్రమంగా తగ్గించాలని కోరారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయలను, ఎక్కువ కాలం మన్నేలా ఉండే ప్లాస్టిక్ ను వాడాలని అధికారులు సూచించారు.

ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి తమ సంస్థ కట్టుబడి ఉందని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతినిధి తెలిపారు. పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తమ సంస్థ చాలా వరకు తగ్గించిందన్నారు. ప్రస్తుతం మొత్తం వస్తువుల పంపిణీలో కేవలం 7శాతం మాత్రమే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్నామని వివరించారు. జూన్ 2020 నాటికి పూర్తిగా వాడకం ఆపేస్తామన్నారు.