టీ షర్టు వేసుకొచ్చిన ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి పంపేసిన స్పీకర్

గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసమాకు సోమవారం పరాభవం ఎదురైంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది టీ షర్టు వేసుకొచ్చినందుకు గానూ.. బయటకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇది తొలిసారేం కాదు... వారం క్రితమే స్పీకర్ టీ షర్టు వేసుకురావద్దంటూ హెచ్చరించారు.

టీ షర్టు వేసుకొచ్చిన ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి పంపేసిన స్పీకర్

MLA assembly

MLA evicted from Assembly: గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసమాకు సోమవారం పరాభవం ఎదురైంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది టీ షర్టు వేసుకొచ్చినందుకు గానూ.. బయటకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇది తొలిసారేం కాదు… వారం క్రితమే స్పీకర్ టీ షర్టు వేసుకురావద్దంటూ హెచ్చరించారు.

ఎమ్మెల్యేలు తప్పనిసరిగా షర్టు లేదా కుర్తా ధరించి మాత్రమే హౌజ్ లోకి అడుగుపెట్టాలి. సూచనలు పట్టించుకోకుండా వచ్చిన ఎమ్మెల్యేను బయటకు వెళ్లిపొమ్మని షర్ట్ లేదా కుర్తా, బ్లేజర్ వేసుకుని వస్తేనే రావాలని చెప్పారు. స్పీకర్ నిర్ణయానికి అసంతృప్తికి గురైన చూడసమా కాసేపటి వరకూ వాదించారు. అసెంబ్లీ ఎన్నికలకు అదే ఔట్ ఫిట్ తో ప్రచారం చేశానని ఇప్పుడు అది ధరిస్తే సమస్యేంటని ప్రశ్నించారు.

‘నేను టీ షర్టు వేసుకునే ఓట్లు అడిగాను. నా ఓటర్లు ఇచ్చిన సర్టిఫికేట్ లాంటిది ఈ టీ షర్ట్. నా ఓటర్లను మీరు అవమానిస్తున్నారు’ అంటూ కామెంట్లు చేశారు. విసిగిపోయిన స్పీకర్ త్రివేది.. ఎమ్మెల్యే చూడసమాను హౌజ్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశిస్తూ.. ఫార్మల్ డ్రెస్ లో లేదా షర్ట్, బ్లేజర్ వేసుకుని వస్తేనే రావాలని చెప్పారు.

‘నువ్వు ఓటర్లను ఎలా కలిశావో నాకు అనవసరం. స్పీకర్ ఆదేశాన్ని మాత్రం అవమానిస్తున్నావు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి నీకు నచ్చిన డ్రెస్ వేసుకుని వస్తానంటే కుదరదు. ఇది ప్లే గ్రౌండ్ కాదు. పాటించాల్సిన ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి’ అని స్పీకర్ త్రివేది అంటున్నారు.

అలా బయటకు వెళ్లిపోయిన తర్వాత బీజేపీ మంత్రి ప్రదీప్‌సిన్హ్ జడేజా స్పీకర్ ఆదేశాలు పాటించనందుకు ఆ ఎమ్మెల్యేను 3రోజుల పాటు సస్పెండ్ చేయాలంటూ ప్రపోజల్ పెట్టారు.