కొవిడ్ హెల్ప్ లైన్‌కు కాల్ చేస్తే చచ్చిపొమ్మని సలహా

హోం ఐసోలేషన్ యాప్ ఇన్ స్టాల్ అయి ఉందా అని అడిగాడు. అలా చేయాలని ఏ అధికారి చెప్పలేదు కదా అని సంతోష్..

కొవిడ్ హెల్ప్ లైన్‌కు కాల్ చేస్తే చచ్చిపొమ్మని సలహా

Covid Help Line

Covid Helpline: కొవిడ్ మహమ్మారి ప్రభావంతో ఇండియా వ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. పేషెంట్లకు, బాధితులకు అందుబాటులో ఉండేందుకు కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలా ఫోన్ చేసిన వారికి మానసిక స్థూర్యం నింపాల్సింది పోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. హోం ఐసోలేషన్ యాప్ వాడకంపై పలు సందేహాలను అడిగిన పేషెంట్ ను పోయి చావమని కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ సూచనలిచ్చాడు.

లక్నోలో ఉండే సంతోష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఏప్రిల్ 10న టెస్టు చేయించుకోవడంతో కొవిడ్ పాజిటివ్ అని వచ్చింది. అతని భార్యకు సైతం అవే లక్షణాలు కనిపించాయి. ఇద్దరూ సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. సహాయం కోసం కొవిడ్ కమాండ్ సెంటర్ కు కాల్ చేశాడు సంతోష్ కుమార్. ఏప్రిల్ 15న కాల్ బ్యాక్ వచ్చింది.

కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ హోం ఐసోలేషన్ యాప్ ఇన్ స్టాల్ అయి ఉందా అని అడిగాడు. అలా చేయాలని ఏ అధికారి చెప్పలేదు కదా అని సంతోష్ బదులిచ్చాడు. అంతే అటువైపు నుంచి పోయి చావు అయితే అనేశాడు.

ఈ ఘటనపై సంతోష్ కుమార్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు, లక్నో జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ ప్రకాశ్ కు లెటర్ రాసి వివరణ కోరనున్నాడు. సంతోష్ తండ్రి మనోహర్ బీజేపీ లక్నో యూనిట్ కు మాజీ ప్రెసిడెంట్ కూడా.

ఇండియాలో కరోనాతో ఎఫెక్ట్ అయిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 27వేల కొత్త కరోనావైరస్ కేసులు నమోదుకాగా, 120 మృతులు సంభవించాయి. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. చాపకిందనీరులా వ్యాప్తి చెందుతూనే ఉంది.