Uttarakhand Earthquake : ఉత్తరాఖండ్‌లో 48 గంటల్లో రెండోసారి భూకంపం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేవలం 48 గంటల్లో రెండోసారి భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది....

Uttarakhand Earthquake : ఉత్తరాఖండ్‌లో 48 గంటల్లో రెండోసారి భూకంపం

Uttarakhand Earthquake

Uttarakhand Earthquake : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేవలం 48 గంటల్లో రెండోసారి భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. ‘‘గురువారం తెల్లవారుజామున 3:49 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో ఉత్తరకాశీ నగరంలో భూకంపం సంభవించింది’’ అని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొంది. 48 గంటల వ్యవధిలో రాష్ట్రంలో భూకంపం నమోదు కావడం ఇది రెండోసారి.

Also read : Road Accident : ఉత్తరప్రదేశ్‌లో మరో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

మంగళవారం పిథోరఘర్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు అదే రోజు నేపాల్‌లో వరుసగా నాలుగు భూకంపాలు వచ్చాయి. అత్యంత శక్తివంతమైన భూకంపం యొక్క కేంద్రం ఉత్తరాఖండ్‌లోని తీర్థయాత్ర పట్టణం జోషిమఠ్ కు ఆగ్నేయంగా 206 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు ఉత్తరాన 284 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ భూకంపం యొక్క ప్రకంపనలు సంభవించాయి.

Also read : Earthquake : భవిష్యత్‌లో భారీ భూకంపాల ముప్పు…ఐఐటీ భూకంప నిపుణుడి హెచ్చరిక

నేపాల్ భూకంపాల క్రమం పశ్చిమ నేపాల్‌లో మధ్యాహ్నం 2:25 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తర్వాత మధ్యాహ్నం 2:51 గంటలకు 6.2 తీవ్రతతో మరోసారి కుదుపు నమోదైంది. ఆ తర్వాత అదే ప్రాంతంలో మధ్యాహ్నం 3:06 గంటలకు, 3:19 గంటలకు వరుసగా 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.6, 3.1 తీవ్రతతో మరో రెండు భూ ప్రకంపనలు సంభవించాయి.

Also read : CM Jagan : ఢిల్లీకి సీఎం జగన్.. ముఖ్యమంత్రి హస్తిన పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ

త్రిపుర, నేపాల్, ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో నాలుగు భూప్రకంపనలు వచ్చిన నేపథ్యంలో ప్రొఫెసర్ జావేద్ మాలిక్ దీనిపై అధ్యయనం చేసి భవిష్యత్ భూకంపాలు వచ్చే ముప్పు ఉందని హెచ్చరించారు. గంగా తీరం వెంబడి ఉన్న పట్టణ కేంద్రాలు భవిష్యత్తులో మరింత శక్తివంతమైన భూప్రకంపనలు సంభవించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ చెప్పారు. ఈ నేపథ్యంలో వస్తున్న వరుస భూకంపాలు ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.