Earthquake : భవిష్యత్‌లో భారీ భూకంపాల ముప్పు…ఐఐటీ భూకంప నిపుణుడి హెచ్చరిక

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో భవిష్యత్‌లో భారీ భూకంపాలు వస్తాయా? అంటే అవునంటున్నారు ఐఐటీ కాన్పూర్‌కు చెందిన భూకంప నిపుణుడు ప్రొఫెసర్ జావేద్ మాలిక్....

Earthquake : భవిష్యత్‌లో భారీ భూకంపాల ముప్పు…ఐఐటీ భూకంప నిపుణుడి హెచ్చరిక

Earthquake

Earthquake : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో భవిష్యత్‌లో భారీ భూకంపాలు వస్తాయా? అంటే అవునంటున్నారు ఐఐటీ కాన్పూర్‌కు చెందిన భూకంప నిపుణుడు ప్రొఫెసర్ జావేద్ మాలిక్. త్రిపుర, నేపాల్, ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో నాలుగు భూప్రకంపనలు వచ్చిన నేపథ్యంలో ప్రొఫెసర్ జావేద్ మాలిక్ దీనిపై అధ్యయనం చేశారు. గంగా తీరం వెంబడి ఉన్న పట్టణ కేంద్రాలు భవిష్యత్తులో మరింత శక్తివంతమైన భూప్రకంపనలు సంభవించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ చెప్పారు.

Also read : Road Accident : ఉత్తరప్రదేశ్‌లో మరో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

భూకంపాల చారిత్రక నమూనా సమీప భవిష్యత్తులో బలమైనది సంభవించే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. గంగా తీరం వెంట ఉన్న నగరాలు, పట్టణాల్లో ఇసుక భూభాగం ఉన్నందున భూకంపం సమయంలో భవనాలకు అధిక నష్టం జరిగే అవకాశముందని ప్రొఫెసర్ వెల్లడించారు. 1934వసంవత్సరంలో రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2015వ సంవత్సరంలో 7.8 తీవ్రతతో నేపాల్‌లో భూకంపం వచ్చింది. 1505లో సంభవించిన అతిపెద్ద భూకంపం 8.3 తీవ్రతతో నమోదైందని ఆయన చెప్పారు.

Also read : CM Jagan : ఢిల్లీకి సీఎం జగన్.. ముఖ్యమంత్రి హస్తిన పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ

చారిత్రక డేటాతో భూకంపాల సంభావ్యత గురించి ప్రొఫెసర్ మాలిక్ మాట్లాడుతూ త్వరలో బలమైన భూకంపం వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న కాలంలో మరోసారి అధిక తీవ్రతతో కూడిన భూకంపం రావడం ఖాయమని, దాని ప్రభావం కూడా కనిపిస్తుందని అందరూ సిద్ధం కావాలని ప్రొఫెసర్ కోరారు. అయితే ఈ భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టమని మాలిక్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1505వ సంవత్సరంలో రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని ఆయన చెప్పారు.

భూకంపం ఎలా వస్తుందంటే….

ఆ తర్వాత 1803వసంవత్సరంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ చారిత్రక భూకంపాల ఆధారంగా, భవిష్యత్తులో ప్రతి 300 నుంచి 500 సంవత్సరాలకు ఉత్తరాఖండ్ అధిక తీవ్రతతో కూడిన భూకంపాలు రావచ్చని భూకంప నిపుణుడు హెచ్చరించారు. భూమి టెక్టోనిక్ ప్లేట్లపై ఉందని, దాని కింద ద్రవం ఉంటుందని ఈ ప్లేట్లు నిరంతరం కదులుతుంటాయని మాలిక్ చెప్పారు.

Also read : Balakrishna : చంద్రబాబు అరెస్ట్.. జూనియర్ ఎన్టీఆర్‌ మౌనంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నపుడు, లేదా తాకినపుడు భూకంప శక్తి విడుదల అవుతుందని, దీంతో భూకంపాలకు దారి తీస్తుందని భూకంప నిపుణుడు వెల్లడించారు. భూకంపాలు ఇటీవల పెరిగాయని, దీనికి భౌగోళిక కారకాలే కారణమని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన భూకంప నిపుణుడు ప్రొఫెసర్ జావేద్ మాలిక్ వివరించారు.