ఉగ్రవేట : పుల్వామాలో భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు

జమ్మూకాశ్మీర్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భద్రతా దళాలు ఉన్నాయి. ఉగ్రవాదులను ఏరివేసే పనిని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పుల్వామా జిల్లా

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 01:55 AM IST
ఉగ్రవేట : పుల్వామాలో భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు

జమ్మూకాశ్మీర్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భద్రతా దళాలు ఉన్నాయి. ఉగ్రవాదులను ఏరివేసే పనిని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పుల్వామా జిల్లా

జమ్మూకాశ్మీర్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భద్రతా దళాలు ఉన్నాయి. ఉగ్రవాదులను ఏరివేసే పనిని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పుల్వామా జిల్లా పింగలాన్  ఏరియాలో 2019, ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఓ ఇంట్లో నక్కిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన అదిల్ దార్‌తో వాళ్లిద్దరికి సంబంధాలు ఉన్నట్టు సమాచారం. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.

 

ఫిబ్రవరి 14వ తేదీ పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. CRPF జవాన్లు లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. పుల్వామా ఉగ్రదాడి వెనక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం ఉందని తేలింది. జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల అంతుచూడాలని యావత్ దేశం ప్రతీకారంతో రగిలిపోతోంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాక్ కేంద్రంగా పని చేస్తున్న టెర్రరిస్టు శిబిరాలను, టెర్రరిస్టులను మట్టుబెట్టడానికి బలగాలు సిద్ధంగా ఉన్నాయి.