Certificate case: పుట్టుకతో ముస్లిం కాదంటూ సమీర్ వాంఖడేకు క్లీన్ చిట్

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన వాంఖడే కులం ప్రస్తావనను నవాబ్ మాలిక్ లేవనెత్తారు. మనోజ్ సాన్సరె, అశోక్ కాంబ్లే, సంజయ్ కాంబ్లే లాంటి తదితరులు కూడా ఈ విషయమై ప్రశ్నలు సంధించారు. ఇక వాంఖడే అరెస్ట్ చేసిన ఆర్యన్ ఖాన్‭కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇవ్వడం.. ఇత్యాది అంశాలతో వాంఖడేపై ఒత్తడి పెరిగింది. ఒకానొక సమయంలో ఆయన భవితవ్యంపై నీలి నీడలు కుమ్ముకున్నాయి.

Certificate case: పుట్టుకతో ముస్లిం కాదంటూ సమీర్ వాంఖడేకు క్లీన్ చిట్

Ex NCB officer Sameer Wankhede gets clean chit in certificate case

Certificate case: ముంబై క్రూయిజ్ షిప్‭లో డ్రగ్స్ పట్టుబడ్డ అనంతరం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పేరు ఒక్కసారిగా దేశమంతటా మారుమోగిపోయింది. ఆ కేసులో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‭ను వాంఖడే అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన నకిలీ సర్టిఫికెట్ చూపించి ఉద్యోగం పొందారంటూ ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ సహా పలువురు ఆరోపించారు. అప్పటి నుంచి సమీర్ ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా ఆయనకు ఊరట లభించింది. సమీర్ వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని, ఆయన షెడ్యూల్డ్ క్యాస్ట్‭లోని మహార్ కమ్యూనిటీకి సంబంధించిన వారని క్యాస్ట్ స్క్రూటినీ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.

సమీర్ తండ్రి జ్ణాన్‭దేవ్ వాంఖడే హిందూయిజాన్ని వదిలేసి ఇస్లాంను స్వీకరించారని వచ్చిన ఆరోపణలు కూడా నిజం కావని క్యాస్ట్ స్క్రూటినీ కమిటీ వెల్లడించింది. ఆయన ఎస్సీలోని మహార్-37 వర్గానికి చెందిన వారని, ఫిర్యాదు చేసిన వారి వాదనలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. క్యాస్ట్ స్క్రూటినీ కమిటీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన అనంతరం ‘‘సత్యమేవ జయతే’’ అంటూ సమీర్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. వాంఖడేపై ఇచ్చిన ఫిర్యాదులపై ముంబై జిల్లా క్యాస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కమిటీ సమీక్షించి, అదే రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన వాంఖడే కులం ప్రస్తావనను నవాబ్ మాలిక్ లేవనెత్తారు. మనోజ్ సాన్సరె, అశోక్ కాంబ్లే, సంజయ్ కాంబ్లే లాంటి తదితరులు కూడా ఈ విషయమై ప్రశ్నలు సంధించారు. ఇక వాంఖడే అరెస్ట్ చేసిన ఆర్యన్ ఖాన్‭కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇవ్వడం.. ఇత్యాది అంశాలతో వాంఖడేపై ఒత్తడి పెరిగింది. ఒకానొక సమయంలో ఆయన భవితవ్యంపై నీలి నీడలు కుమ్ముకున్నాయి. ఈ కేసు దర్యాప్తులో నిర్లిప్తంగా వ్యవహరించినందుకు గాను వాంఖడేపై చర్యలు తీసుకోవాలని గతంలో కేంద్ర ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయనను ముంబై నుంచి చెన్నైకి బదిలీ చేశారు.

Maharashtra: శివసేన కార్యాలయం కాదు.. మరి షిండే వర్గం నిర్మించబోయే ఆ కొత్త భవనం దేనికి?