Maharashtra: శివసేన కార్యాలయం కాదు.. మరి షిండే వర్గం నిర్మించబోయే ఆ కొత్త భవనం దేనికి?

ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు చట్ట ప్రకారం తమకే పార్టీ గుర్తు రావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమ వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అధికారికంగా పార్టీ తమకే దక్కుతుందని వారి వాదిస్తున్నారు. కాగా, పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేసి బీజేపీతో చేతులు కలిపారని, పార్టీకి ద్రోహం చేసిన వారు ఇప్పుడు పార్టీ తమదేనని అనడం ఏంటని ఉద్ధవ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Maharashtra: శివసేన కార్యాలయం కాదు.. మరి షిండే వర్గం నిర్మించబోయే ఆ కొత్త భవనం దేనికి?

Is Shine group building new office for shivasena in dadar

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే దాదార్ సమీపంలో ఒక కొత్త భవవాన్ని నిర్మించబోతున్నారట. ప్రస్తుతం శివసేన కేంద్ర కార్యాలయానికి సమీపంలోనే ఈ నూతన భవనాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ విషయంలో అటు ఉద్ధవ్ వర్గం, ఇటు షిండే వర్గం మధ్య ఉన్న తగాదా కోర్టు విచారణలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో షిండే వర్గం నిర్మించబోతున్న ఈ నూతన భవనం శివసేన పార్టీ కార్యాలయం కోసమేననే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న కార్యాలయం థాకరే కుటుంబ ఆధీనంలో ఉండడంతో పార్టీ కార్యకలాపాల కోసం షిండే వర్గం కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉందట.

రాష్ట్రవ్యాప్తంగా హల్‭చల్ చేస్తున్న ఈ వార్తల్ని మహారాష్ట్ర మంత్రి, షిండే వర్గీయుడు ఉదయ్ సావంత్ ఖండించారు. తమకు ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్నే శివసేన అధికారిక కార్యాలయంగా భావిస్తామని, దానికి పోటీగా కానీ, సమాంతరంగా కానీ మరే కార్యాలయం నిర్మించబోమని స్పష్టం చేశారు. అయితే ప్రజలకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని, అందుకోసం దాదర్‭లో ముఖ్యమంత్రి కోసం ఒక కార్యాలయాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తాము శివసేన భవన్‭ను గౌరవిస్తామని, అది అలాగే ఉంటుందని శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఉదయ్ సావంత్ వెల్లడించారు.

ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు చట్ట ప్రకారం తమకే పార్టీ గుర్తు రావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమ వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అధికారికంగా పార్టీ తమకే దక్కుతుందని వారి వాదిస్తున్నారు. కాగా, పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేసి బీజేపీతో చేతులు కలిపారని, పార్టీకి ద్రోహం చేసిన వారు ఇప్పుడు పార్టీ తమదేనని అనడం ఏంటని ఉద్ధవ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Nitish kumar: బీజేపీని 4 మంత్రి పదవులు అడిగితే ఇవ్వలేదు