Face Mask: మాస్కులు ఆప్షనల్.. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, బెంగాల్ కూడా

కొవిడ్ మహమ్మారి ప్రభావం తర్వాత మనిషి అనే వాళ్ల ముఖం కనబడితే ఒట్టు.. అడ్డుగా మాస్కుతో రూపురేఖలే మారిపోయాయి. యావత్ ప్రపంచమంతా ఇదే వైఖరి.

Face Mask: మాస్కులు ఆప్షనల్.. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, బెంగాల్ కూడా

Face Mask

Face Mask: కొవిడ్ మహమ్మారి ప్రభావం తర్వాత మనిషి అనే వాళ్ల ముఖం కనబడితే ఒట్టు.. అడ్డుగా మాస్కుతో రూపురేఖలే మారిపోయాయి. యావత్ ప్రపంచమంతా ఇదే వైఖరి. కొన్ని నెలల తర్వాత గానీ ఒక్కొక్కరు మాస్కులు పక్కకుపెట్టే పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు అందులో మహారాష్ట్ర కూడా చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరాఠీ స్పెషల్ అయిన గుడిపడ్వా పండుగ సందర్భంగా మాస్కులు ఆప్షనల్ చేస్తూ.. ప్రజల ఇష్టానికే వదిలేసింది ప్రభుత్వం. ఇప్పుడు అదే పంథాలో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లు కూడా పయనిస్తున్నాయి. భారీ సమూహాలు, గుంపులుగా ఏర్పడ్పప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలనే నిబంధనను ఎత్తేశాయి.

పబ్లిక్ ప్లేసుల్లో ఇప్పటి నుంచి మాస్క్ ధరించని వారిపై ఎటువంటి ఫైన్ ఉండబోదని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం మాస్క్ ధరించకపోతే వేసే రూ.500 ఫైన్ ఇక లేనట్టే అన్నమాట.

Read Also : అప్పుడు మాస్క్‌‌లు, ఇప్పుడు హోం క్వారంటైన్‌‌కు గుడ్ బై

పశ్చిమబెంగాల్ లో మార్చి 2020 తర్వాత నుంచి మొహాలకు అతుక్కుపోయిన మాస్కులను పక్కకుపెట్టేస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆ నిబంధనను ఎత్తేస్తూ.. గురువారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని బెంగాల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది.