Gold Price : పండుగ వేళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

పండుగ వేళ చాలామంది బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. దీంతో దేశంలో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

Gold Price : పండుగ వేళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

Gold Price Today

Gold Price : మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం, పండుగ ఉంటే బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక కొందరైతే పెట్టుబడులకోసం బంగారం కొంటుంటారు. అయితే ఈ బంగారం ధరపై ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అనే దానిపై సామాన్యులకు అవగాహన ఉండదు. ఇక మార్కెట్ పై కొంచం పట్టున్నవాళ్ళు ధరల పెరుగుదల, తగ్గుదలను ముందుగానే పసిగడుతుంటారు. పండుగ సమయం కావడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గడిచిన 10 రోజుల్లో 5 సార్లు బంగారం ధరలు పెరిగాయి. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 రూపాయలు పెరిగింది.

చదవండి :  ఈమె బంగారు పెళ్లికూతురు.. వంటిపై 60కేజీల పసిడి

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు బంగారం ధర రూ.44,160గా ఉంది. ఇక పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు ధర రూ.48,170 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,170 ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,160 పలుకుతోంది. 24 క్యారెట్ల ధర రూ.48,170 ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46, 300కి లభిస్తోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,320 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030 వద్ద అందుబాటులో ఉంది.

చదవండి :  ఫేస్ క్రీమ్ డబ్బాలో అరకిలో బంగారం తరలింపు..సీజ్ చేసిన అధికారులు

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 పలుకుతోంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.