Election Commission : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ర్యాలీలు ఉండాలా ? వద్దా, ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

ఈసీ తీరును వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు తీవ్రంగా తప్పుబట్టాయి. కరోనా మరణాలు ఈసీ చేసిన హత్యలంటూ మద్రాస్‌ హైకోర్టు గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో థర్డ్‌వేవ్ వ్యాప్తికి....

Election Commission : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ర్యాలీలు ఉండాలా ? వద్దా, ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ

Ec

Five States Election 2022 : త్వరలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు ఇప్పటికే ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిదే. కానీ..దిక్కుమాలిన వైరస్ మరింత విజృంభిస్తోంది. నేనున్నా అంటూ..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే..ఎన్నికల సందర్భంగా ఈసీ పలు నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై 2022, జనవరి 15వ తేదీ శనివారం వరకు నిషేధం విధించింది. ఇప్పుడా ఆ నిషేధాన్ని పొడిగించాలా వద్దా అన్న దానిపై శనివారం క్లారిటీ రానుంది. నిషేధంపై సమీక్ష నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. ఎన్నికల సంఘం భేటీ కానుంది.

Read More : UP Election 2022 : యూపీ బీజేపీ ఫస్ట్ లిస్ట్.. గోరఖ్ పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ

ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్‌లో మాత్రం ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, మార్చి 7 మధ్య ఉత్తరప్రదేశ్ ఏడు దశల్లో 403 ఎమ్మెల్యేలను ఎన్నుకోనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్దితులను బట్టి చూస్తే బహిరంగ ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు దారి తీశాయన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

Read More : Acharya : మెగాస్టార్ ఫ్యాన్స్‌‌కు బ్యాడ్ న్యూస్.. ‘ఆచార్య’ విడుదల వాయిదా

గత ఎన్నికల సమయంలో ఈసీ తీరును వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు తీవ్రంగా తప్పుబట్టాయి. కరోనా మరణాలు ఈసీ చేసిన హత్యలంటూ మద్రాస్‌ హైకోర్టు గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో థర్డ్‌వేవ్ వ్యాప్తికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కారణం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందంటున్నారు వైద్య నిపుణులు. మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం పరిమితంగానైనా బహిరంగ ప్రచారానికి అనుమతి ఇవ్వాలని ఈసీని కోరుతున్నాయి. పూర్తిగా వర్చువల్ ప్రచారాలు చేసుకుంటే ఇక జనాన్ని ఆకర్షించడం కష్టమని ఆయా పార్టీలు, అభ్యర్ధులు భావిస్తున్నారు. దీంతో ఈసీ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.