G20 Summit : జి20 సదస్సు సందర్భంగా ఢిల్లీకి రైల్వే పార్శిల్ సర్వీసు నిలిపివేత
జి 20 సదస్సు సందర్భంగా ఢిల్లీకి సెప్టెంబరు 10వతేదీ వరకు రైల్వే పార్శిల్ సర్వీసును నిలిపివేశారు. న్యూఢిల్లీ, పాత ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ఆనంద్ విహార్ టెర్మినల్, సరాయ్ రోహిల్లాతో సహా పలు రైల్వే స్టేషన్లలో ఆంక్షలు విధించారు....

Indian Railways
G20 Summit : జి 20 సదస్సు సందర్భంగా ఢిల్లీకి సెప్టెంబరు 10వతేదీ వరకు రైల్వే పార్శిల్ సర్వీసును నిలిపివేశారు. న్యూఢిల్లీ, పాత ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ఆనంద్ విహార్ టెర్మినల్, సరాయ్ రోహిల్లాతో సహా పలు రైల్వే స్టేషన్లలో ఆంక్షలు విధించారు. ఈ స్టేషన్ల నుంచి బయలుదేరే, ప్రయాణించే లేదా ముగించే ప్యాసింజర్ రైళ్లు, లీజుకు తీసుకున్న వాటితో సహా ఎలాంటి పార్శిల్ కోచ్‌లు ఉండవు. అన్ని పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా రద్దు చేశారు.
JK Terrorist killed : జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్..ఉగ్రవాది హతం
జి20 సమ్మిట్ కోసం భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ఉత్తర రైల్వే సెప్టెంబర్ 8 నుంచి 10వతేదీ వరకు ఢిల్లీలో పార్శిల్ వ్యాన్ల తరలింపుపై ఆంక్షలు విధించింది. జి20 లీడర్స్ సమ్మిట్ సెప్టెంబర్ 9-10 వరకు జరగనుంది. రైల్వేస్టేషన్ల నుంచి వచ్చే ట్రాఫిక్ పై కూడా పరిమితులు విధించారు.
Jill Biden Covid positive : జిల్ బిడెన్ కు కొవిడ్ పాజిటివ్…ప్రెసిడెంట్ బిడెన్‌కు నెగిటివ్
పార్శిల్ గోదాములు, ప్లాట్ ఫారమ్ లపై పార్శిల్ ప్యాకేజీలు ఉండవు. సదస్సు సందర్భంగా భద్రత దృష్ట్యా ప్యాసింజర్ కోచ్ లలో వ్యక్తిగత సామాన్లను మాత్రమే అనుమతించనున్నారు. సదస్సు సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.