Subhash Chandra Bose Daughter: మా నాన్న సుభాష్ చంద్రబోస్-గాంధీజీ మధ్య సంబంధంపై నేతాజీ కూతురు సంచలన వ్యాఖ్యలు

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కూతురు అనితా బోస్.. మహాత్మా గాంధీతో తన తండ్రికి ఉన్న సంబంధం గురించి కీలకమైన కామెంట్లు చేశారు. వాళ్లిద్దరి మధ్యలో రిలేషన్ చాలా క్లిష్టంగా ఉండేదని.. కాకపోతే

Subhash Chandra Bose Daughter: మా నాన్న సుభాష్ చంద్రబోస్-గాంధీజీ మధ్య సంబంధంపై నేతాజీ కూతురు సంచలన వ్యాఖ్యలు

Netaji Chandra Bose

Subhash Chandra Bose Daughter: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కూతురు అనితా బోస్.. మహాత్మా గాంధీతో తన తండ్రికి ఉన్న సంబంధం గురించి కీలకమైన కామెంట్లు చేశారు. వాళ్లిద్దరి మధ్యలో రిలేషన్ సత్సంబంధాలు ఉండేవి కావని.. కాకపోతే నేతాజీని గాంధీ బాగా పొగిడేవారని చెప్పారు. బ్రిటీష్ వారికి నేతాజీ చంద్రబోస్ ను అప్పగించడానికి మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ సిద్ధమయ్యారంటూ కంగనా రనౌట్ చేసిన కామెంట్ల తర్వాత అనితా స్పందించారు.

‘నేతాజీ, గాంధీ ఇద్దరూ గొప్ప హీరోలే. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారే. ఒకరు లేకుండా మరొకరు లేరు. అదొక కాంబినేషన్ అంతే. కొందరు కాంగ్రెస్ సభ్యులు అహింసా సిద్ధాంతమే భారత స్వాతంత్ర్యానికి కారణమైందని చెప్పడం సరి కాదు. ఇండియన్ నేషనల్ ఆర్మీ నేతాజీ తీసుకున్న యాక్షన్ కూడా అందులో భాగమే. అలా అని నేతాజీనే స్వాతంత్ర్యం తెచ్చారని కాదు.. గాంధీ చాలా మంది ఇన్‌స్పైర్ చేయగలిగారు. నేతాజీని కూడా..

లక్షల్లో జనం భారత స్వాతంత్ర్యం కోసం పాటు పడ్డారని ఆమె ముగించారు.

………………………………………………. : కిలో రూ.100 కి చేరిన టమాట ధర

మంగళవారం కంగనా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లు మహాత్మా గాంధీ సపోర్ట్ తీసుకోలేదని, ఈ అహింసా సిద్ధాంతాన్ని పాటించలేదని రాసుకొచ్చారు. ఓ చెంప మీద కొడితే మరో చెంప చూపిస్తే వచ్చిన స్వాతంత్ర్యం భిక్ష లాంటిదేనని మరోసారి అన్నారు.

పద్మశ్రీ అందుకున్న కంగనా.. అదే రోజు మీడియా సమావేశంలో భారత్‌కు అసలైన స్వాతంత్ర్యం 2014 లో వచ్చిందని, 1947లో లభించింది కేవలం భిక్ష మాత్రమేనని వ్యాఖ్యానించారు. భారత్‌కు 1947లో స్వాతంత్ర్యం రాలేదని , అది బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్ష అని , నిజమైన స్వాతంత్ర్యం 2014లో దేశప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాకే వచ్చిందని కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.