Dead Boy Breathing : కాసేపట్లో అంత్య‌క్రియ‌లు..అమ్మ పిలుపుకు కొట్టుకున్న పిల్లాడి గుండె..

కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన ఆరేళ్ల కొడుకు తల్లి పిలుపుకు కళ్లు తెరిచిన ఘటన హర్యానాలోని బ‌హ‌దూర్‌గ‌ఢ్ ప్రాంతంలో సంచలనం కలిగించింది. అమ్మ పిలిస్తే యముడ్ని కూడా ఎదిరించి వచ్చేసాడా అనిపించిందీ ఘటన. చనిపోయిన కొడుకుని తలుచుకుని ఆ కొడుకు ముద్దు మాటలు...అల్లరి పనులు తలచుకుని తలచుకుని ఏడుస్తున్న తల్లికి కళ్లు తెరిచిన కొడుకుని చూసుకుని పడిన ఆనందం అంతా ఇంతా కాదు.

Dead Boy Breathing : కాసేపట్లో అంత్య‌క్రియ‌లు..అమ్మ పిలుపుకు కొట్టుకున్న పిల్లాడి గుండె..

6 Years Boy Dead

Haryana 6 years dead boy Shocking Incident : అమ్మ ప్రేమ. మాటలతో వర్ణించలేదనిది. అటువంటి తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఘటన జరిగింది హర్యానా రాష్ట్రంలో. కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన ఆరేళ్ల కొడుకు తల్లి పిలుపుకు కళ్లు తెరిచిన ఘటన బ‌హ‌దూర్‌గ‌ఢ్ ప్రాంతంలో సంచలనం కలిగించింది. అమ్మ పిలిస్తే యముడ్ని కూడా ఎదిరించి వచ్చేసాడా అనిపించిందీ ఘటన. చనిపోయిన కొడుకుని తలుచుకుని ఆ కొడుకు ముద్దు మాటలు…అల్లరి పనులు తలచుకుని తలచుకుని ఏడుస్తున్న తల్లికి కళ్లు తెరిచిన కొడుకుని చూసుకుని పడిన ఆనందం అంతా ఇంతా కాదు. లోకాన్నే జయించినంతగా సంబరపడిపోయింది కొడుకు ముఖాన్ని వాత్సల్యపు ముద్దులతో నింపేసింది.హ‌ర్యానాలో జరిగిన ఈ అద్భుత ఘటన గురించి ఒక్క‌ పిలుపుతో ఆ ఆరేళ్ల పిల్లాడు లేచి కూర్చోవ‌డం ఆ ఊరి వారంతా ఆ త‌ల్లి ప్రేమ‌ను క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటున్నారు.

హ‌ర్యానాలోని బ‌హ‌దూర్‌గ‌ఢ్ ప్రాంతానికి చెందిన హితేష్‌, ఝాన్వి భార్యాభర్తలు. వారికి ఆరు ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ పిల్లాడికి టైఫాయిడ్ జ్వ‌రం వచ్చింది. చికిత్స అందించినా తగ్గలేదు. దీంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నా ఫలితం దక్కలేదు. మే 26 న చనిపోయాడని డాక్టర్లు చెప్పటంతో ఝాన్వి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. ‘‘పట్టుమని పదేళ్లు కూడా నిండని నీకు నీకు అప్పుడే నిండిపోయాయా కన్నా’ అంటూ గుండెలు అవిసేలా ఏడ్చింది. ఏక ధారగా ఏడుస్తూనే ఉంది. ‘ఎంత ఏడ్చినా పోయిన నీకొడుకు తిరిగొస్తాడామ్మా..దేవుడికి దయలేదమ్మా..ఊరుకోమ్మా’ అంటూ బంధువులు..ఇరుగు పొరుగువారు ఓదార్చినా ఆ తల్లి వేదన తీరలేదు. ‘‘లేనా కన్నా..లే అమ్మా అని ఒక్కసారి పిలవరా బాబూ’ అని తల్లడిల్లిపోతూ ఏడుస్తూనే ఉంది.

ఎంత ఏడ్చినా జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి కదా..అంత్య‌క్రియ‌లకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాత్రంతా శ‌వం వ‌ద్ద జాగార‌ణ చేస్తూ త‌ల్లిదండ్రులు ఏడుస్తూనే ఉన్నారు. ‘లేచి కూర్చోరా నాన్నా’ అంటూ ఆ పిచ్చిత‌ల్లి అమాయ‌కంగా పిల్లాడ్ని మృత‌దేహాన్నిఅటూ ఇటూ క‌దుపుతూ ఏడుస్తూనే ఉంది. మరి ఏదేవుడు ఆ తల్లి మొర విన్నాడో గానీ..‘‘పిల్లాడి శ‌రీరంలో క‌ద‌లిక క‌నిపించాయి..అంతే ఒక్క‌సారి ఆశ్చ‌ర్య‌పోయిన తండ్రి వెంట‌నే తేరుకుని పిల్లాడి శ‌రీరాన్ని ప్యాకింగ్ నుంచి వేరు చేసి నోటి ద్వారా శ్వాస అందించాడు.

అచ్చు సినిమాల్లోలాగా ఆ పిల్లాడి గుండెల మీద గ‌ట్టిగా ఒత్తడంతో ఒక్క‌సారి పిల్లాడి గుండె కొట్టుకోవ‌డం ప్రారంభ‌మైంది. అంతే ఆ తల్లిదండ్రుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు.వెంటనే చికిత్స కోసం పిల్లాడ్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోహ‌త‌క్ ఆసుపత్రికి తరలించారు. జరిగింది చెప్పగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ల ఆక్సిజన్ పెట్టి చికిత్స ప్రారంభించాడు. ఇప్పుడు ఆ పిల్లాడు చక్కగా కోలుకోవటంతో మంగ‌ళ‌వారం (జూన్ 15,2021) డిశ్చార్జ్ చేయగా ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయాడ‌నుకున్న కొడుకు బతికిరావటంతో తల్లిదండ్రులకు సాక్షాత్తూ ఆ భగవంతుడే తమ మొర ఆకలించాడని మురిసిపోతున్నారు. నా కొడుకు మృత్యుంజయుడు అని మురిసిపోతున్నారు. గ్రామ‌స్థులు ఆశ్చ‌ర్యానికి అంతు లేదు. ఆ తల్లిదండ్రుల మొర దేవుడు ఆలకించాడు..చచ్చిపోయిన కొడుకుని తిరిగి ఇచ్చాడంటూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.‘‘ అమ్మ ప్రేమ’’ కొడుకుని బతికించిందని చెప్పుకుంటున్నారు.