Robber Alibaba: 176 సీసీటీవీలు, 97 సిమ్ములు ట్రాక్.. గజదొంగ ‘అలీబాబా’ను పట్టుకోవడానికి ముంబై పోలీసుల ఫీట్లు

ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారి సమిత్ పాటిల్ మాట్లాడుతూ ‘‘ఈ కేసులో విచారణ అనంతరం కూడా అనుమానితులెవరో తెలియలేదు. అందుకే మా బృందాలు నేరస్థలానికి సమీపంలోని సీసీటీవీలను పరీక్షించింది. 97 సిమ్ కార్డ్‌లను ట్రాక్ చేసింది. చోరీ సమయంలో నిందితుల సిమ్‌కార్డుల లొకేషన్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని నోయిడా వరకు ట్రాక్ చేసింది

Robber Alibaba: 176 సీసీటీవీలు, 97 సిమ్ములు ట్రాక్.. గజదొంగ ‘అలీబాబా’ను పట్టుకోవడానికి ముంబై పోలీసుల ఫీట్లు

How Mumbai Cops Catch Robber Alibaba

Robber Alibaba: ఒకరేమో పోస్ట్‭మ్యాన్ అవతారంలో, మరొకరేమో పండ్ల వ్యాపారి వేషం, మరొకరు ఇంకోలా.. అలీబాబా అనే గజదొంగను పట్టుకోవడానికి ముంబై పోలీసులు వేసిన ఎత్తుగడలు ఇవి. అతడితో పాటు మరో ఇద్దరు దొంగలను సైతం పట్టుకున్నారు. వాస్తవానికి అతడి అసలు పేరు సల్మాన్ జుల్‭ఫికర్ అన్సారి. కానీ అతటి ట్రూ కాలర్ పేరు అలీబాబా. తన అసలు పేరును దాచి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అలీబాబాను పట్టుకోవడానికి సాంకేతికంగా కూడా పోలీసులు బాగానే కష్టపడ్డారు. మొత్తంగా 176 సీసీటీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. 97 సిమ్ కార్డుల లోకేషన్ ట్రాక్ చేశారు. ఇంత చేసి ఎట్టకేలకు అలీబాబాను పట్టుకున్నారు.

ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారి సమిత్ పాటిల్ మాట్లాడుతూ ‘‘ఈ కేసులో విచారణ అనంతరం కూడా అనుమానితులెవరో తెలియలేదు. అందుకే మా బృందాలు నేరస్థలానికి సమీపంలోని సీసీటీవీలను పరీక్షించింది. 97 సిమ్ కార్డ్‌లను ట్రాక్ చేసింది. చోరీ సమయంలో నిందితుల సిమ్‌కార్డుల లొకేషన్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని నోయిడా వరకు ట్రాక్ చేసింది. ఇంత జరిగిన అనంతరం అలీబాబా పట్టుబడ్డాడు’’ అని పేర్కొన్నారు. ట్రాక్ అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన ముంబై పోలీసులు పండ్ల విక్రయదారులు, పోస్ట్‌మెన్‌ల వంటి వేషదారణలో ఉన్నారని పాటిల్ తెలిపారు. అలీబాబా సహా మరో ఇద్దరిని పట్టుకుని ముంబై తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. వారి నుంచి 18 లక్షల రూపాయల విలువైన బంగారం, 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పాటిల్ పేర్కొన్నారు.

Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడి హోటల్ కూల్చివేత.. నంద కుమార్ కుటుంబ సభ్యుల అభ్యంతరం