Odisha Train Accident: రైలు ప్రమాదంపై కొత్త ప్రశ్నలు.. కవచ్ ఉండి కూడా ప్రమాదం జరిగిందా? లేదంటే కవచమే లేదా?

కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసారి అమలులోకి తీసుకువచ్చారు

Odisha Train Accident: రైలు ప్రమాదంపై కొత్త ప్రశ్నలు.. కవచ్ ఉండి కూడా ప్రమాదం జరిగిందా? లేదంటే కవచమే లేదా?

Kavach Indian Railway

Bharat ka kavach: ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే కవచ్ ఉండుంటే ఈ రైలు ప్రమాదం జరిగేదే కాదని కొందరు అంటున్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసుకువచ్చిన కవచ్ వ్యవస్థ ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. భారత చరిత్రలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదంగా నిలిచింది. గతంలో జరిగిన ఏ రైల్వే ప్రమాదంలోనూ ఇంత పెద్ద మొత్తంలో మరణాలు సంభవించలేదు. దీంతో రైల్వే భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Odisha Train Accident: వెల్లివిరిసిన మానవత్వం.. క్షతగాత్రుల కోసం రక్తదానం చేసేందుకు బారులు తీరిన ప్రజలు

రైల్వే బడ్జెట్‭లో సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని అమల్లోకి తీసుకువచ్చారు. ప్రతి ఏడాది బడ్జెట్‭లో దీనికి భారీ కేటాయింపులే చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన తీసుకువచ్చిన ఈ సాంకేతికత రైల్వే ప్రమాదాన్ని ఎందుకు ఆపలేకపోయిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ రైలు ప్రమాదం జరిగిన రూట్లో ఆ టెక్నాలజీ ఉందా అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి.

ఇంతకీ కవచ్ ఏంటి?
కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసారి అమలులోకి తీసుకువచ్చారు. లోకోమోటివ్‌లు, ట్రాక్‌లు, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్, ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి స్టేషన్‌లలో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాల ద్వారా ఇది పని చేస్తుంది. 4G LTE ఆధారిత సిస్టంతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సిస్టమ్.. అల్ట్రా-హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది.

PM Modi : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి .. మృతుల కుటుంబాలకు సానుభూతి

రైలు ఢీకొనడానికి ప్రధాన కారణమైన లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేసినప్పుడు కవాచ్ హెచ్చరిస్తుంది. సిస్టమ్ లోకో పైలట్‌ను అప్రమత్తం చేయగలదు. బ్రేక్‌లను నియంత్రించగలదు, నిర్ణీత దూరం లోపు అదే లైన్‌లో మరొక రైలును గమనించినప్పుడు స్వయంచాలకంగా రైలు కదలికను నిలిపివేస్తుంది. పరికరం రైలు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది, లోకోమోటివ్‌లకు సిగ్నల్‌లను పంపుతుంది, ఇది పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా సహాయపడుతుంది.

Odisha Train Accident: ఒడిశాలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదంపై తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు ఇవే..

అయితే ప్రస్తుతం ఈ టెక్నాలజీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే పూర్తి స్థాయిలో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్షిణ మధ్య రైల్వే జోన్‌లో 65 లోకోమోటివ్‌లు, 1445 కిలోమీటర్ల మార్గంలో 134 స్టేషన్‌లలో అమలు చేస్తున్నారు. అయితే ట్రాకుల పరిధి చూసుకుంటే 1200 కిలోమీటర్లలో అమలులో ఉందట. భారతీయ రైల్వే యొక్క మిషన్ రాఫ్తార్ ప్రాజెక్ట్‌లో భాగంగా న్యూఢిల్లీ-ముంబై, హౌరా-ఢిల్లీ మెయిన్ లైన్లలో 3,000 కిలోమీటర్ల మార్గంలో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తెలిపిన ఈ వివరాల్ని చూసుకుంటే కొంకణ్ రైల్వే పరిధిలో (ప్రమాదం జరిగిన రైల్వే జోన్) కవచ్ టెక్నాలజీ లేదని స్పష్టమవుతోంది. అందుకే మూడు రైళ్లు ఢీకొట్టుకున్నట్లు నిపుణులు అంటున్నారు.