Odisha Train Accident: వెల్లివిరిసిన మానవత్వం.. క్షతగాత్రుల కోసం రక్తదానం చేసేందుకు బారులు తీరిన ప్రజలు

Odisha Train Accident: వెల్లివిరిసిన మానవత్వం.. క్షతగాత్రుల కోసం రక్తదానం చేసేందుకు బారులు తీరిన ప్రజలు

People Queue Up To Donate Blood

Odisha Train Crash : మానవత్వం వెల్లివిరిసింది. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనలో గాయపడిన వారికి రక్తదానం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.(People Queue Up) బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 280 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యిమందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బాలాసోర్‌ పట్టణంలో గాయపడిన వారి కోసం రక్తదానం చేయడానికి ప్రజలు బారులు తీరారు.తీవ్ర గాయాలతో రక్తం పోయిన వారికి దాతల నుంచి రక్తం తీసుకొని వారికి ఎక్కిస్తున్నారు. (Donate Blood To Those Injured)

Odisha train tragedy: ఒకరికి చేయి తెగింది..మరొకరికి కాలు పోయింది..క్షతగాత్రుల రోదనలతో మార్మోగిన సంఘటన స్థలం

రైలు ప్రమాదం జరిగినపుడు తాను సంఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నానని, దీంతో తాను ఇతరులతో కలిసి 300 మందిని రక్షించామని స్థానికుడు గణేష్ చెప్పారు. శుక్రవారం రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, కోల్‌కతా నుంచి మరికొంత మంది ఆర్మీ సిబ్బంది రానున్నారని ఇండియన్ ఆర్మీ కల్నల్ ఎస్‌కే దత్తా చెప్పారు. 200 అంబులెన్స్‌లు, 45 మొబైల్ హెల్త్ టీమ్‌లు సంఘటనా స్థలంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు.ఎస్‌సిబికి చెందిన 25 మంది వైద్యుల బృందంతో పాటు 50 మంది అదనపు వైద్యులను కూడా సమాయత్తం చేశారు.

Odisha Train Crash: భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం…రైలు ప్రమాదాల పర్వం

శుక్రవారం రాత్రి నుంచి ఆరు బృందాలు పని చేస్తున్నాయని ఎన్డీఆర్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ తెలిపారు.గుర్తింపు పత్రాలు సమర్పించి మృతి చెందిన వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.గాయపడిన బాధితులు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు శవపరీక్షలు కూడా ప్రారంభించారు.