India Covid-19 : 46 రోజుల తర్వాత.. దేశంలో 3వేల మార్క్ దాటిన కరోనా కేసులు!

India Covid-19 : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రోజువారీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి.

India Covid-19 : 46 రోజుల తర్వాత.. దేశంలో 3వేల మార్క్ దాటిన కరోనా కేసులు!

India Records 3,303 Covid 19 Cases, 39 Deaths

India Covid-19 : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రోజువారీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో గురువారం (ఏప్రిల్ 28) కొత్తగా 3,303 కరోనా రోజువారీ కేసులు నమోదు కాగా, మరో 39 మరణాలు నమోదయ్యాయి. దాంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,68,799కి చేరుకుంది. అయితే కరోనా యాక్టివ్ కేసులు 16,980కి పెరిగాయి. 46 రోజుల తర్వాత.. కరోనా రోజువారీ కేసులు 3,000 మార్క్‌ను దాటాయి.

కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,23,693కి చేరుకుంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి. నేషనల్ కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కరోనా కేసులు 701 కేసులు పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారం పాజిటివిటీ రేటు 0.61 శాతంగా నమోదైందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,28,126కు పెరిగింది. కరోనా మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 188.40 కోట్లకు దాటిపోయింది.

India Records 3,303 Covid 19 Cases, 39 Deaths (1)

India Records 3,303 Covid 19 Cases, 39 Deaths

భారత కరోనా కేసుల సంఖ్య ఆగస్టు 7, 2020 నాటికి 20 లక్షలు ఉండగా.. ఆగస్టు 23న 30 లక్షలకు పెరిగాయి. సెప్టెంబర్ 5న 40 లక్షలు ఉండగా.. సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలుగా ఉన్న కరోనా కేసులు అక్టోబర్ 11న 70 లక్షలు దాటాయి. అక్టోబర్ 29న 80 లక్షల నుంచి నవంబర్ 20న 90 లక్షలకు దాటాయి. డిసెంబర్ 19న కరోనా కేసుల సంఖ్య కోటి మార్కును అధిగమించింది. భారత్ మే 4, 2021న రెండు కోట్లు, జూన్ 23న 3 కోట్ల భయంకరమైన మైలురాయిని దాటింది.

కొత్తగా 39 మరణాలలో కేరళ నుంచి, ఢిల్లీ, హర్యానా నుంచి 36 మంది ఉండగా.. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కొరుగా ఉన్నారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాలు 5,23,693 నమోదు కాగా.. మహారాష్ట్ర నుంచి 1,47,838, కేరళ నుంచి 68,952, కర్ణాటక నుంచి 40,057, తమిళనాడు నుంచి 38,025, ఢిల్లీ నుంచి 26,170, ఉత్తరప్రదేశ్ నుంచి 23,506, పశ్చిమ బెంగాల్ నుంచి 21,201 మంది మరణించారు. 70 శాతానికి పైగా కరోనా మరణాలు కోమోర్బిడిటీల కారణంగానే సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also : India Covid-19 : భారత్‌లో కరోనా విజృంభణ.. పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలు